Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ రైలు.. వచ్చే నెలలో అందుబాటులోకి.. ఏ రూట్లో అంటే

మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంటారు.

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో వందేభారత్ రైలు.. వచ్చే నెలలో అందుబాటులోకి.. ఏ రూట్లో అంటే

Vande Bharat Express: ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే వందే భారత్ రైలును గత సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌లో ప్రారంభించారు.

Budget Session: రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్న ప్రభుత్వం

మొదటి వందేభారత్ రైలు అందుబాటులోకి వచ్చిన నెల రోజులకే తెలుగు రాష్ట్రాలకు మరో రైలును అందించబోతుంది కేంద్రం. ఈ సారి సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఈ రైలు నడవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది తిరుపతి వెళ్తుంటారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీకి అనుగుణంగా కొన్నిసార్లు రైళ్ల సంఖ్య పెంచుతున్నా సరిపోవడం లేదు. దీంతో వందే భారత్ రైలు ప్రవేశపెడితే ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందే భారత్ రైలును ప్రారంభించేందుకు దక్షిణమధ్య రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

రాబోయే ఫిబ్రవరిలోనే ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఆదివారం ట్రయల్ రన్ కూడా పూర్తైంది. ఈ రెండింటి మధ్య నాలుగు మార్గాలుండగా, సికింద్రాబాద్-విజయవాడ-నెల్లూరు-తిరుపతి మార్గంలో రైలు నడపాలని నిర్ణయించారు. చెన్నై నుంచి వచ్చిన రైలుతో అధికారులు ట్రయల్ రన్ పూర్తి చేశారు. ఫిబ్రవరిలో మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా ఈ రైలును ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎనిమిది వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ఒకటి కేటాయించారు.

సికింద్రాబాద్-తిరుపతి మార్గంలోని రైలు తొమ్మిదవది అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి 70 వందే భారత్ రైళ్లను తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాబోయే మూడేళ్లలో మొత్తం 400 రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇవి దేశంలోనే ఆధునిక రైళ్లు. అవి కూడా పూర్తి స్వదేశీ తయారీ రైళ్లు కావడం విశేషం.