Telangana : తెలంగాణలో మరో వైరస్ ఎంట్రీ..బ్లాక్ ఫంగస్ టెన్షన్

కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది.

Telangana : తెలంగాణలో మరో వైరస్ ఎంట్రీ..బ్లాక్ ఫంగస్ టెన్షన్

Black Fungus

Black Fungus Tension : కరోనా ధాటికి తెలంగాణా విలవిలలాడుతుంటే..మరో వైరస్ ఎంట్రీ ఇచ్చింది. అసలు ఏమి జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. తొలిసారి బ్లాక్ ఫంగస్ కేసులను అధికారులు గుర్తించారు. కోవిడ్ బారిన పడిన పలువురిలో బ్లాక్ ఫంగస్ ఉ న్నట్లు నిర్ధారించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటించారు.

కోవిడ్ రోగులకు ట్రీట్ మెంట్ సమయంలో..షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయాలని అన్ని ఆసుపత్రులకు సూచించారు. బ్లాక్ ఫంగస్ రాకుండా..తీసుకోవాల్సిన చర్యలపై ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. యాంటీ ఫంగల్, యాంటీ బయోటెక్ మందులు వాడాలన్నారు.

బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్స కోసం నోడల్ కేంద్రంగా కోఠి ఈఎన్టీ ఆసుపత్రి కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ తో కంటి సమస్యలు ఏర్పడితే..సరోజిని దేవి కంటి ఆసుపత్రి వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. గాంధీ, కోఠి ఈఎన్టీ, సరోజినిదేవి సూపరింటెండెంట్స్ సమన్వయంతో పని చేయాలన్నారు. కోవిడ్, బ్లాక్ ఫంగస్ ఉన్న వారికి గాంధీలో చికిత్స అందిస్తున్నామన్నారు.

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పలువురు బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ బారిన పడ్డారు. ముగ్గురిలో ఒకరు చనిపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బ్లాక్ ఫంగస్ సోకిన వారిని హైదరాబాద్ కు తరలించారు.

దీనిపై తెలంగాణ డీఎంఈ (డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్) రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ కేసులు కూడా ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని, ప్రైవేటు ఆసుపత్రులు బ్లాక్ ఫంగస్ కేసులను గాంధీ ఆసుపత్రికి పంపుతామని అడుగుతున్నారని వెల్లడించారు.

Read More : AIIMS : బ్లాక్ ఫంగస్‌పై ఏయిమ్స్ డైరెక్టర్ హెచ్చరికలు