తెలంగాణలో యాంటీ బాడీస్ టెస్టు ఫలితాలు విడుదల : ICMR

  • Published By: sreehari ,Published On : October 1, 2020 / 07:37 PM IST
తెలంగాణలో యాంటీ బాడీస్ టెస్టు ఫలితాలు విడుదల : ICMR

ICMR Anti Bodies Test Results : తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ఐసీఎంఆర్ యాంటీబాడీస్ టెస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. రెండో దశ చేసిన పరీక్షల్లో ప్రజల్లో యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు.



మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని ఐసీఎంఆర్ వెల్లడించింది. 0.5 శాతం నుంచి 18.2 శాతానికి యాంటీబాడీస్ పెరిగాయని పేర్కొంది. తెలంగాణలో సగటున 12 శాతం మందికి కరోనా (Covid-19 cases) వచ్చిపోయిందని నిర్ధారించారు.



చాలామందిలో కరోనా వచ్చి పోయిన సంగతే తెలియదని, వారిలో యాంటీబాడీస్ ఆధారంగా కరోనా వచ్చినట్టు నిర్ధారణకు వచ్చినట్టు తెలిపింది. మొదటి దశలో కేవలం 0.25 శాతం మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. 0.5శాతం నుంచి 18.2 శాతానికి యాంటీ బాడీస్ పెరిగాయి.



జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 1300 మందికి యాంటీబాడీ టెస్టులు నిర్వహించారు. జనగామలో 18 శాతం, కామారెడ్డిలో 6.9శాతం, నల్గొండలో 11.1 శాతం కరోనా పాజిటివ్ వచ్చిందని ఐసీఎంఆర్ పేర్కొంది.