RK RoJa : సీఎం కేసీఆర్‌‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా.. తర్వాత చిరంజీవితో

ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం...మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి...

RK RoJa : సీఎం కేసీఆర్‌‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా.. తర్వాత చిరంజీవితో

Roja And Kcr

AP Minister RK Roja : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రి రోజా.. ప్రగతి భవన్ లో దర్శనమిచ్చారు. వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది మర్యాదపూర్వక భేటీ అని ప్రచారం జరుగుతున్నా.. పొలిటికల్ వర్గాల్లో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. తనకు టైం ఇవ్వాలని గురువారమే మంత్రి రోజా కోరినట్లు..దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఆమెకు ప్రగతి భవన్ వర్గాలు సమయం కేటాయించారని తెలుస్తోంది. దీంతో నేరుగా ప్రగతి భవన్ కు చేరుకున్న మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలిశారు. సినిమా అంశాలే కాకుండా.. రాజకీయాలపై చర్చించారని సమాచారం.

Read More : Minister Roja : మహిళల రక్షణ కోసం చంద్రబాబు ఒక్క పథకమైనా తీసుకొచ్చారా? : మంత్రి రోజా

అయితే.. మర్యాదపూర్వకంగానే తాను సీఎం కేసీఆర్ ను కలుస్తానంటూ ముందే రోజా చెప్పారని సమాచారం. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. సీఎం కేసీఆర్ ఆశీర్వచనాలు తీసుకోవడానికే ఇక్కడకు వచ్చారని తెలుస్తోంది. అయితే.. మంత్రి కేటీఆర్ ఏపీలో నెలకొన్న పరిస్థితిపై చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఏపీలో రోడ్లు, విద్యుత్ విషయంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ పెద్దలు భగ్గుమంటున్నారు. ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఏపీ మంత్రి రోజా.. సీఎం కేసీఆర్ ను కలవడంపై చర్చలు జరుగుతున్నాయి. ఏపీ సీఎం జగన్ రెండోసారి కేబినెట్ విస్తరణలో చిత్తూరు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి పదవి దక్కింది.

Read More : Minister Roja : మంత్రి రోజా సెల్ ఫోన్ దొరికింది.. ఎలా గుర్తించారు ?

సీఎం కేసీఆర్ రాజకీయాల పట్ల రోజా అభిమానంతో ఉంటారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. గతంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోజాకు ఫోన్ లో సీఎం కేసీఆర్ పరామర్శించారు. కాంచీపురం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. నగరి వద్ద ఆగి… రోజా ఇంటికి వెళ్లి అక్కడ భోజనం చేశారు. అంతేగాకుండా హైదరాబాద్ లో జరిగే పలు కార్యక్రమాల్లో రోజా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత.. సినీ నటుడు చిరంజీవిని కూడా మంత్రి రోజా కలువబోతున్నారని సమాచారం.