AR Rahman : బతుకమ్మ పాటకు ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్

ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ బతుకమ్మ పాటను రూపొందించారు. ఈ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతోంది.

AR Rahman : బతుకమ్మ పాటకు ఏఆర్‌ రెహ్మాన్‌ మ్యూజిక్

Song

music for Batukamma song : మ్యూజిక్ మ్యాస్ట్రో, ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహ్మాన్‌ సంగీతంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ బతుకమ్మ పాటను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ పాటను  త్వరలోనే విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతోంది. ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉందని తెలంగాణ జాగృతి నేతలు అంటున్నారు. దేశ వ్యాప్తంగా ట్రెండ్‌ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా 810 రకాల చీరలను 1.08 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు ఖర్చు చేసింది.

Telangana : వరిసాగు తగ్గించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్

రాష్ట్రంలో అక్టోబర్ 6 వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేశారు. 18 ఏళ్లు దాటిన రేష‌న్ కార్డులో పేరు న‌మోదైన వారికి చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఈ ఏడాది సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారు చేశారు.

గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలు, ఇండ్ల వద్దకు చీరలు చేరాయి. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఈ చీరల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చీరలన్నీ దాదాపు అన్ని జిల్లాలకు చేరాయి. జిల్లాల నుంచి గ్రామాల వారిగా అధికారులు మహిళలకు సరఫరా చేశారు.