శాకాహారుల్లో COVID-19తో పోరాడే శక్తి ఎక్కువ ఉంటుందా?

  • Published By: Subhan ,Published On : May 13, 2020 / 07:20 AM IST
శాకాహారుల్లో COVID-19తో పోరాడే శక్తి ఎక్కువ ఉంటుందా?

COVID-19ను ఎదుర్కోవడంలో రోగ నిరోధక శక్తి కీలకంగా వ్యవహరిస్తుందన్న మాట తెలిసిందే. మరి శాకాహారులు, మాంసాహారుల్లో రోగ నిరోధక శక్తి తేడా ఉంటుందా.. పబ్లిక్ హెల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కే. శ్రీనాథ్ రెడ్డి ఏమంటున్నారంటే.. వెజిటేరియన్లు కూడా వైరస్ ప్రభావానికి గురవుతున్నారు. కారణం అది తుంపర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుండటమే. 

నేచురల్ డైట్ లో భాగంగా పళ్లు, కూరగాయలు తీసుకునే వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండటం వాస్తవమే. వారిలో ఇన్ఫెక్షన్ తో పోరాడే స్థాయి ఎక్కువగానే ఉంటుంది. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కార్డియోలజీ డిపార్ట్‌మెంట్ మాజీ హెడ్ రెడ్డి.. ‘మాంసాహారులైనా.. శాకాహారులైనా పళ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడమే మంచిది. అదే శరీరంలోని ఇమ్యూనిటీ స్థాయిని పెంచి వైరస్ ల నుంచి పోరాడే శక్తిని ఇస్తుంది. 

శరీరంతో పాటు కళ్లు, నోరు, ముక్కు కూడా కవర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ‘ఎందుకంటే వైరస్ ప్రధానంగా ముక్కు, నోరు, కళ్ల నుంచే వ్యాప్తి చెందుతుంది. మనం కళ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోం కానీ, ముఖంపై పడే నీటి తుంపర్లు శరీరంలోకి ప్రవేశిస్తాయి. ముక్కులోకి కూడా వెళ్లొచ్చు. 

కళ్లజోడు పెట్టుకోవడం మంచిది కాకపోతే ఫేస్ షీట్లు ధరించడం మంచిదని నిపుణులు అంటున్నారు. ఇవే అదనపు జాగ్రత్తలు తీసుకుని వైరస్ నుంచి కాపాడుకోవాలని నిపుణులు అంటున్నారు. దాంతో పాటు మంచి డైట్ కూడా పాటించాలి. కాలుష్యం, పొగ ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది. అలా తిరిగితే ఊపిరితిత్తుల పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. 

Read Here>> కరోనా నుంచి రక్షంచుకోవటానికి , ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవటానికి ఈ విటమిన్స్ తీసుకుంటే చాలు