Asaduddin Owaisi: సరూర్‌నగర్ పరువు హత్య ఘటనపై స్పందించిన ఓవైసీ.. నిందితులను..

సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి...

Asaduddin Owaisi: సరూర్‌నగర్ పరువు హత్య ఘటనపై స్పందించిన ఓవైసీ.. నిందితులను..

Asaduddin Owaisi

Asaduddin Owaisi: సరూర్‌నగర్‌లో జరిగిన పరువు హత్య ఘటనను ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగం, ఇస్లాం ప్రకారం ఇది నేరపూరిత చర్య అని అసద్ పేర్కొన్నారు. భాగ్యనగర ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. సరూర్‌నగర్‌లో జరిగిన ఘటనను ఖండిస్తున్నామని అన్నారు. మహిళ ఇష్టంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని, భర్తను చంపే హక్కు ఆమె సోదరుడికి లేదని అన్నారు. ఇది నేరపూరిత చర్య అన్నారు. అయితే ఈ ఘటనలో నిందితుడిని రక్షించేందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసదుద్దీన్ స్పందిస్తూ.. హంతకులకు మేం అండగా నిలవడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు జహంగీర్‌పురి, ఖర్గోన్‌లలో జరిగిన మతపరమైన హింసాత్మక సంఘటనల గురించి అసదుద్దీన్ స్పందించారు. ఏ మతపరమైన ఊరేగింపును తీసినా మసీదుపై హై రిజల్యూషన్ సీసీటీవీని ఉంచాలని, ఊరేగింపు జరిగినప్పుడల్లా అది జరగాలని అన్నారు. ఎవరు రాళ్లు విసురుతున్నారో ప్రపంచానికి తెలియాలంటే ఫేస్‌బుక్‌లో లైవ్ టెలికాస్ట్ చేయాలని అసదుద్దీన్ అన్నారు.

Inter Religion Marriage: మరో దారుణానికి దారితీసిన మతాంతర వివాహం

బిల్లిపురం నాగరాజు, అష్రిన్ సుల్తానా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ ఒకే స్కూల్, కాలేజీలో చదువుకున్నారు. ఇరువురు వేరువేరు కులాలకు చెందిన వారు. అయితే తన సోదరి నాగరాజుతో ప్రేమలో ఉందని గుర్తించిన నిందితుడు సయ్యద్ మోబిన్ అహ్మద్ సోదరి అష్రిన్ సుల్తానాను హెచ్చరించాడు. ఈ ఏడాది జనవరి 30న బాలానగర్ ఐడీపీఎల్ కాలనీలో ఉన్న తన ఇంటి నుంచి మొబైల్ ఫోన్‌ను తన ఇంట్లోనే ఉంచి అష్రిన్ సుల్తానా బయటకు వచ్చింది. మరుసటి రోజు హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలోని ఆర్యసమాజ్‌లో నాగరాజు, అష్రిన్ సుల్తానా వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం ఎవరూ తమను గుర్తించకుండా నాగరాజు వేరే ఉద్యోగంలోకి మారిపోయాడు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నట్లు ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు పసిగట్టడంతో కొత్తజంట రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు.

Indore fire incident: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు సజీవదహనం..

ఎవరూ తమను వెంటాడటం లేదని భావించి.. అయిదు రోజుల కిందట మళ్లీ నగరానికి వచ్చారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్‌ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్‌ కుటుంబ సభ్యులు మాటువేశారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్‌లు కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్‌ సోదరుడు, అతడి స్నేహితుడు బైక్‌పై వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. నాగరాజుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కాగా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే నిందితులు ముస్లిం వర్గానికి చెందిన వారు కావడంతో వారిని అసదుద్దీన్ ఓవైసీ కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపించాయి. ఇవి తప్పుడు ఆరోపణలని, నిందితులు చేసింది తప్పుడు చర్య అని, వారికి మేము అండగా ఉండమని ఓవైసీ స్పష్టం చేశారు.