సీఏఏకి వ్యతిరేకంగా భారీ మానవహారం : ముస్లింలకు ఒవైసీ పిలుపు

హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్‌ సమీపంలోని ఖిల్వత్‌ గ్రౌండ్స్‌లో ఈ సభను

  • Published By: veegamteam ,Published On : January 26, 2020 / 01:44 AM IST
సీఏఏకి వ్యతిరేకంగా భారీ మానవహారం : ముస్లింలకు ఒవైసీ పిలుపు

హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్‌ సమీపంలోని ఖిల్వత్‌ గ్రౌండ్స్‌లో ఈ సభను

హైదరాబాద్‌లో మజ్లిస్‌ పార్టీ, యునైటెడ్‌ ముస్లిం యాక్షన్‌ కమిటీ సభ జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్‌ సమీపంలోని ఖిల్వత్‌ గ్రౌండ్స్‌లో శనివారం(జనవరి 25,2020) ఈ సభను నిర్వహించారు. సీఏఏ, ఎన్సార్సీలకు వ్యతిరేకంగా జనవరి 30న హైదరాబాద్‌లో భారీ మానవహారం ఏర్పాటు చేయాలని తలపెట్టినట్లు ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తెలిపారు. పోలీసులు అనుమతిస్తే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఇందులో పెద్ద ఎత్తున పాల్గొనాలని ముస్లింలకు పిలుపునిచ్చారు.

caa

దేశవ్యాప్తంగా సీఏఏ ప్రకంపనలు:
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ప్రకంపనలు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. సీఏఏకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు.. అనుకూలంగా బీజేపీ పోటాపోటీ ప్రదర్శనలు చేపడుతున్నాయి. సీఏఏ చట్ట వ్యతిరేకం అని, రాజ్యాంగ విరుద్ధం అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దేశ పౌరుల హక్కులను కాలరాస్తుందని చెబుతున్నాయి. మత ప్రాతిపదికన ప్రజలను విడగొట్టే ప్రయత్నం జరుగుతోందని అంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాయి. కేరళ, రాజస్థాన్, పంజాబ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

ca1

పౌరసత్వం ఇచ్చేది.. లాక్కునేది కాదు:
బీజేపీ నేతలు మాత్రం విపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నారు. సీఏఏ… పౌరసత్వం ఇచ్చేది.. లాక్కునేది కాదని స్పష్టం చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ప్రతిపక్షాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏని వాడుకుంటున్నాయని, ప్రజలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. ప్రపంచంలోని పలు ప్రాంతాలలో కంటే భారతదేశంలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని బీజేపీ నేతలు చెప్పారు. ప్రపంచంలోనే ముస్లింలకు అత్యంత మెరుగ్గా సమాన అవకాశాలు కల్పిస్తున్న దేశం భారత్ అని, వారు భారత్‌లోనే సురక్షితంగా ఉన్నారని వివరిస్తున్నారు.