Jogulamba Temple : ఉసిరికాయ ఆకృతిలో గర్భగుడి గోపురం .. సతీదేవి దంతాలు,దవడ భాగాలు పడిన శక్తిపీఠం జోగులాంబ పుణ్యక్షేత్రం

జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా.. పావన తుంగభద్రా నది తీరాన జోగులాంబగా వెలసింది అమ్మవారిమహిమలు విశేషాలు.

Jogulamba Temple : ఉసిరికాయ ఆకృతిలో గర్భగుడి గోపురం .. సతీదేవి దంతాలు,దవడ భాగాలు పడిన శక్తిపీఠం జోగులాంబ పుణ్యక్షేత్రం

Dussehra Special..Jogulamba Temple

Dussehra Special..Jogulamba Temple : జోగులాంబ..! తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో వెలసిన ఈ క్షేత్రానికి అనేక విశిష్టతలున్నాయి. చారిత్రకంగా శైవ క్షేత్రాల్లో అలంపూర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దక్షిణ కాశీగా శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా.. పావన తుంగభద్రా నది తీరాన జోగులాంబగా వెలసింది అమ్మవారు.

తెలుగురాష్ట్రాల్లో వెలసిన 4 శక్తిపీఠాల్లో మొదటిది జోగులాంబ శక్తిపీఠం.. తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అలంపూర్‌లో ఉంది ఈ దివ్యక్షేత్రం.. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు, దవడ భాగం ఈ ప్రదేశంలో పడినట్లు చెబుతారు. కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు…. తుంగభద్రా నదిగా కలిసే స్థలంలో వెలసింది అమ్మవారు. దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో అయిదవ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న ఈ క్షేత్రంలో బ్రహ్మకు తొమ్మిది ఆలయాలు ఉండడం విశేషం. ఈ ఆలయం గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. దక్షిణ కాశీగా , శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా వెలుగొందుతోంది ఈ క్షేత్రం.

“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

పరమపావనమైన ఈ అలంపూర్‌ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతమై దర్శనమిస్తారు. అమ్మవారి కేశాలు గాల్లో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. వీటి వెనుక ఓ పరమార్థం ఉంది. బల్లి శకునాల చిహ్నం, అందుకే అమ్మవారు శకునాలకు అధిపతి, తేలు న్యాయ ధర్మాల చిహ్నం, అందుకే అమ్మవారు న్యాయధర్మాలకు అధిపతి అని.. గుడ్లగూబ లక్ష్మీ అమ్మవారి వాహనం కాబట్టి అలక్ష్మిని తొలగిస్తుందని.. కపాలం, ప్రేతం తాంత్రికోపాసన చిహ్నాలు.. కాబట్టి అమ్మవారు తాంత్రికోపాసనకు అధిపతి అని చెబుతుంటారు. భర్త స్మశానంలో ఉంటాడు కాబట్టి ఆ స్మశాన వికృతాలను తలమీద ధరించింది అమ్మవారు. దీనికి సంతోషించిన స్వామివారు.. ఆ వికృతాలకు ఓ స్థిరత్వాన్ని, శక్తిని ఆపాదించి వాటికి అమ్మవారిని అధిపతిని చేశాడు.

అందుకే అలంపూర్‌ జోగులాంబ నరఘోషకు అధిపతిగా కొలుస్తారు. జోగులాంబను దర్శించుకుంటే వాస్తు దోషాలు, కీడు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అమ్మవారిని గృహచండిగా కూడా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణీ.. వసంత పంచమినాడు అమ్మవారిని సహస్త్ర ఘటాభిషేకం చేస్తారు. అమ్మవారి ఊష్ణరూపిణి కాబట్టి.. ఆ ఊష్ణం తగ్గడానికి వెయ్యి కళశాలతో అభిషేకం చేస్తారు. మానవ ప్రయత్నంతోనే కాకుండా భగవంతుడి అనుగ్రహంతో జరిగే కార్యాలకు జోగులాంబ అమ్మవారు అధిపతి అని చెబుతారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ ఆలయంలో ఉన్న కోనేరు ఈ ప్రాంత వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం.. అమ్మవారి నిజరూప దర్శనం వృద్ధురాలిగా ఉంటుంది..

Dussehra 2022 : వందల ఏళ్ల చరిత్ర కలిగిన మైసూర్ దసరా ఉత్సవాలు .. చాముండీ అమ్మవారి విశేష పూజలు

ఈ ఆలయంలో మొగ్గరూపంలో ఉన్న కుండలిని చెక్కబడి ఉంది. ఇలా మరెక్కడా కనిపించదు. ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే కుండలిని జాగృతమవుతుందని.. కుండలిని జాగృతమవడమంటే మోక్షానికి దగ్గరగా చేరినట్లేనని చెబుతారు. కుండలిని జాగృతమైన మనిషికి ఇహంతో పని ఉండదని చెబుతారు.కాశీ క్షేత్రానికి, ఈ క్షేత్రానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెబుతారు. ఉత్తర భారతంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతటి పుణ్యఫలం దక్కుతుందో అలంపూర్‌లోని బాల బ్రహ్మేశ్వరున్ని దర్శించినా అంతే మహా పుణ్యం లభిస్తుందంటారు పండితులు. కాశీ క్షేత్రంలో గంగా నది ఉంటే అలంపూర్‌లో తుంగభద్రా నది ఉంది.. అక్కడ విశ్వేశ్వర, విశాలాక్షులు ఉంటే.. ఇక్కడ బాల బ్రహ్మేశ్వర, జోగులాంబలు కొలువై ఉన్నారు. కాశీ సమీపంలోని ప్రయాగలో గంగా-యమునల సంగమనం జరిగితే.. అలంపూర్‌లో తుంగభద్ర-కృష్ణా నదులు కలిసి సంగమేశ్వరంలో కలుస్తాయి. కాశీలో వరుణ-అసి అనే నదులు సంగమిస్తే.. అలంపూర్‌లో వేద-నాగవతి నదులు కలుస్తాయి. కాశీలో ఉన్నట్లే 64 స్నాన ఘట్టాలు, 18 తీర్థాలు, అష్టాదశ శక్తిపీఠాలు అలంపూర్‌లో కూడా ఉన్నాయి. అందుకే దీనిని దక్షిణ కశీగా అభివర్ణిస్తుంటారు..

Pradyumna Shrinkhala Devi : బాలింతలా నడికట్టు వేసుకునే అమ్మవారు .. శృంఖలాదేవి, చోటిల్లామాతగా పిలబడే అమ్మ

శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామివారి దివ్యక్షేత్రమైన శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా చెప్పబడే ఆలంపూర్‌ గురించి ఎన్నో రకాల స్థల పురాణాలున్నాయి. పూర్వం ఆలంపూర్‌ క్షేత్రాన్ని హేమలాంపురం అని పిలిచేవారు. ఈ పేరు రూపాంతరం చెందుతూ హతంపురం, యోగాలాపురం, జోగుళాపురం, అనంతరం అలంపురంగా రూపాంతరం చెందింది. బాదామి చాళుక్యుల చేతిలో రూపుదిద్దుకున్న ఈ ఆలంపూర్‌ నవబ్రహ్మ ఆలయాలకు ప్రసిద్ధి. ఈ ఆలయాల నిర్మాణం చాళుక్య రాజైన రెండవ పులకేశి పరిపాలనా కాలంలో మొదలై సుమారు 200 సంవత్సరాలపాటు సాగినట్లు చరిత్ర చెబుతోంది.

అలంపూర్ జోగులాంబ ఆలయ దర్శనం, భక్తులకు మరుపు రాని ఆధ్యాత్మిక అనుభూతిని మిగుల్చుతుంది. ఆలయ పురాతన నిర్మాణ శైలి, భక్తులను కట్టిపడేస్తుంది. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్ప కళ, స్తంభాలు అప్పటి నిర్మాణ శైలికి సజీవ సాక్షంగా ఉన్నాయి. అంతేకాక గుడి పై భాగంలో ఉసిరికాయ ఆకృతిని పోలిన శిలను ఉంచి, దానిపై శిఖరాన్ని ఏర్పర్చిన తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గర్భాలయ ప్రవేశ ద్వారబంధాలకు చిత్రాలంకార శిల్పాలు, ద్వారపాలకులుగా గంగాయమునల విగ్రహాలుంటాయి.