Attack : హైదరాబాద్ లో దారుణం..డీజిల్‌ పోసి విచాక్షణారహితంగా దాడి

హైదరాబాద్‌ అల్వాల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లోతుకుంటలో దారుణం జరిగింది. నాగసాయి అనే బ్యాండ్‌ బృందం సభ్యుడిపై తోటి సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

10TV Telugu News

Attack on a person : హైదరాబాద్‌ అల్వాల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లోతుకుంటలో దారుణం చోటుచేసుకుంది. నాగసాయి అనే బ్యాండ్‌ బృందం సభ్యుడిపై తోటి సభ్యులు విచాక్షణారహితంగా దాడి చేశారు. గతంలో వీరందరూ ఒకే బ్యాండ్‌ బృందంలో కలిసి పనిచేశారు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో నాగసాయి బోనాల పండుగ నుంచి కొత్తగా మరో బ్యాండ్‌ బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

దీంతో పాత బ్యాండ్‌ బృందం సభ్యులు నాగసాయిపై కక్ష పెంచుకున్నారు. నాగసాయిని బైక్‌పై తమ పాత బ్యాండ్‌ కార్యాలయానికి తీసుకొచ్చారు. కాసేపు వీరందరూ చర్చించుకున్నారు. ఇంతలో మాట మాట పెరగడంతో నాగసాయిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు.

Honour Killing : పరువు హత్య కేసులో అన్నకు ఉరి..తండ్రి,ఇద్దరు పోలీసులు సహా 12 మందికి యావజ్జీవం

నాగసాయిపై డీజిల్‌ పోసి ఆటూ ఇటూ లాగుతూ దాడి చేశారు. ఈ దాడిలో నాగసాయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు అల్వాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.