Minister Harish Rao: బీజేపీలో విషం తప్ప విషయం లేదు.. ఒక్క విషయంపై స్పష్టత ఇవ్వలేదు

బీజేపీలో విషం తప్ప విషయం లేదని తేలిపోయిందని, ఒక్క విషయంపై కూడా బీజేపీ స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గత రెండురోజుల బీజేపీ కార్యవర్గం దేశానికి దిశ, నిర్దేశం చేస్తారని ఎదురు చూశామని, మేము అధికారంలోకి వస్తామన్న యావ, సీఎం కేసీఆర్ నామస్మరణ తప్ప ఏమీ లేదని విమర్శించారు

Minister Harish Rao: బీజేపీలో విషం తప్ప విషయం లేదు.. ఒక్క విషయంపై స్పష్టత ఇవ్వలేదు

Harish Rao

Minister Harish Rao: బీజేపీలో విషం తప్ప విషయం లేదని తేలిపోయిందని, ఒక్క విషయంపై కూడా బీజేపీ స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. గత రెండురోజుల బీజేపీ కార్యవర్గం దేశానికి దిశ, నిర్దేశం చేస్తారని ఎదురు చూశామని, మేము అధికారంలోకి వస్తామన్న యావ, సీఎం కేసీఆర్ నామస్మరణ తప్ప ఏమీ లేదని విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో నీళ్ళు వచ్చిన విషయం నిజం కాదా? పాలమూరు, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాకు వస్తారా పోదాం అంటూ హరీష్ రావు బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఒకవేళ మేము మీతో వస్తాం.. రైతుల దగ్గరకు వచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా అంటూ ప్రశ్నించారు. నీళ్లు లేనిదే రాష్ట్రంలో ధాన్యం దిగుబడి పెరిగిందా.. ఈ విషయంకూడా బీజేపీ నేతలు గుర్తించకుండా కేవలం తెలంగాణ ప్రభుత్వంపై విషంకక్కడమే లక్ష్యంగా పెట్టుకొని సభను నిర్వహించారంటూ మండిపడ్డారు.

Harish Rao: ఆర్మీని ప్రైవేటు పరం చేసే కుట్ర: మంత్రి హరీష్ రావు

వ్యవసాయ రంగంలో తెలంగాణ వృద్ధిరేటు 21శాతమని, నీళ్లు వచ్చింది నిజం, నియామకాలు జరిగింది నిజం. ఇవేవి పట్టించుకోకుండా బీజేపీ నేతలు వారిస్థాయిని తగ్గించుకునేలా మాట్లాడుతున్నారని అన్నారు. డబులింజన్ ఉన్న యూపీలో 71వేలు తలసరి ఆదాయం. అక్కడికంటే సింగిల్ ఇంజిన్ తెలంగాణలో తలసరి ఆదాయం మూడు రెట్లు ఎక్కువ అంటూ హరీష్ రావు అన్నారు. రాష్ట్ర సంపద పెరిగిందని, పేదలకు దక్కిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అందితే మరింత అభివృద్ధి జరిగేదని హరీష్ రావు అన్నారు. ఆర్థిక సంఘం నివేదికలు ఏ ప్రధాని తుంగలో తొక్కలేదని, కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందో  చెప్పాలన్నారు. నియామకాల గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని, రెండు కోట్ల ఉద్యోగాలు డొల్ల అని తేలిపోయిందని అన్నారు. ఉద్యోగాల నియామకం పై కేంద్రం శ్వేత పత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మేము 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, మీరు తొలగిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు.

Minister Harish Rao : పెట్రోల్ పై పెంచింది బారాణా..తగ్గించింది చారాణా : మంత్రి హరీష్ రావు

ప్రధాని కూడా అసత్యాలు చెప్పే యత్నం చేశారని, మీరు బియ్యం ఉచితంగా ఇస్తున్నామని చెప్పుకోండి అభ్యంతరం లేదు. కానీ.. బియ్యం పంపిణీ లో రాష్ట్రం పెట్టె నిదులు ఇవ్వండి అంటూ హరీష్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ లో 980కోట్ల రూపాయలు వెచ్చించామని, ఆయుష్మాన్ భవలో 170 కోట్లు మాత్రమే అందాయన్నారు. సిలిండర్ ధర 400 నుంచి వెయ్యి కి పైగా పెరిగిందని విమర్శించారు. ప్రధాని మోదీ జాతీయ ప్రాజెక్టు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదని, క్రిష్ణా నీటి వాటా తేల్చాలని ఎన్నోసార్లు కోరామని, ఇప్పటి కీ తేల్చలేదని అన్నారు. కాళేశ్వరంకు 80వేల కోట్ల రూపాయలకు అన్ని అనుమతులు ఇచ్చింది. కాళేశ్వరం గొప్ప తనం మీకు అర్థం కాదు…కాళేశ్వరం అంటే ఎని టైం వాటర్ అంటూ హరీష్ రావు అన్నారు.