Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ఇవ్వగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2వేల 246 ఫ్లాట్ల కొనుగోలుకు 33వేల 161 దరఖాస్తులు వచ్చాయి.

Rajiv Swagruha : నేటి నుంచి రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం
ad

Rajiv Swagruha flats : హైదరాబాద్‌ బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి వేలం ఇవాళ్టి నుంచి మొదలైంది. లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను కేటాయించనున్నారు. ఇవాళ పోచారంలోని ఇళ్లకు హెచ్‌ఎండీఏ అధికారులు లాటరీ తీయనున్నారు. రేపు , ఎల్లుండి బండ్లగూడ ఫ్లాట్లను లాటరీ పద్దతిలో కేటాయించనున్నారు. ఇందుకోసం హెచ్‌ఎండీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఫ్లాట్ల విక్రయానికి హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ఇవ్వగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2వేల 246 ఫ్లాట్ల కొనుగోలుకు 33వేల 161 దరఖాస్తులు వచ్చాయి. ఇక పోచారంలోని 1470 ఫ్లాట్ల కోసం 5వేల 921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని 345 ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ డీలక్స్‌ ఫ్లాట్ల కోసం 16వేల 679మంది దరఖాస్తు చేసుకున్నారు.

Telangana : ఆర్ధిక వ్యవస్ధ గాడిలో పెట్టేందుకే భూముల అమ్మకం

రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల కేటాయింపు కోసం ఇవాళ ఉదయం 9 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభం అయింది. లాటరీ ప్రక్రియను ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో లైవ్‌ స్ట్రీమింగ్‌కు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ్లాట్ల కేటాయింపులో పారదర్శకత కోసం పూర్తి ప్రక్రియను హెచ్‌ఎండీఏ అధికారులు రికార్డ్‌ చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్‌ మాత్రమే కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆధార్‌ నంబర్‌ను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోనున్నట్టు వెల్లడించారు.