బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం…కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా అఘాయిత్యం

బీఫార్మసీ విద్యార్థినిపై ఆటోడ్రైవర్‌ అత్యాచారం…కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా అఘాయిత్యం

Autodriver raped on B-pharmacy student : ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగడం లేదు. వీధికో కీచకుడు, సందుకో దుశ్యాసనుడు ఆవిర్భవిస్తూనే ఉన్నారు. హైదరాబాద్‌ నగర శివారుల్లో తాజాగా జరిగిన ఓ సంఘటన భాగ్యనగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఘట్ కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయల్దేరింది. ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు స్నేహితులను పిలిచించి.. బలవంతంగా పొదల్లోకి లాక్కెల్లాడు. ఆ ముగ్గురు.. యువతి బట్టలు చించేసి అత్యాచారం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై వదిలి పరారయ్యారు.

ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం 6గంటల 30నిమిషాల టైమ్‌లో నాగారం నుంచి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, మరో ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఉన్నారు. కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. బాధితురాలు మాత్రమే ఆటోలో ఉండటంతో ఇదే అదనుగా భావించిన డ్రైవర్‌.. ఆమె దిగాల్సిన చోట ఆపకుండా వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అనుమానం వచ్చిన విద్యార్ధిని తన తల్లికి ఫోన్ చేసి విషయం చెప్పింది.

విద్యార్ధిని తల్లి వెంటనే సమీప బంధువుకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే అతడు డయల్‌ 100కు కాల్‌చేసి ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన పోలీసులు.. బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బాధితురాలి ఫోన్‌ నంబర్‌ లొకేషన్‌ను ట్రేస్‌ చేయడంతో.. అది నిర్మాణం ఆగిపోయిన ఓ భవనం వద్ద చూపింది. వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అప్పటికే నిందితులు పారిపోయారు.

ఎట్టకేలకు రాత్రి 7గంటల 50నిమిషాల సమయంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే.. ఆమెను మేడిపల్లిలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని తెలిపారు పోలీసులు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రక్షిత తెలిపారు.

మరోవైపు.. దారుణంపై తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మల్లారెడ్డితో మాట్లాడిన ఆమె.. అమ్మాయికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సత్యవతి రాథోడ్ పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని క్యూర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు.

ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం బాగానే ఉందని, కుడికాలికి మాత్రం గాయమైందని పోలీసులు తెలిపారు. బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేసిన పోలీసులు.. బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నామన్నారు. త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని డీసీపీ రక్షిత తెలిపారు.