COVID-19: కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్.. కేంద్ర తాజా సూచనలు

దేశ ప్రజలంతా సామూహికంగా జరుపుకొనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కోవిడ్ మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది.

COVID-19: కోవిడ్ కేసులు పెరిగే ఛాన్స్.. కేంద్ర తాజా సూచనలు

COVID-19: దేశంలో ఇప్పటికీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాబోయే భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని భావిస్తోంది. అందువల్ల కోవిడ్ నియంత్రణ కోసం తాజాగా రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. ఈ మేరకు శుక్రవారం పలు ఆదేశాలు జారీ చేసింది.

GST On Rentals: ఇంటి అద్దెపై 18 శాతం జీఎస్టీ? కొత్త రూల్స్ ఏం చెబుతున్నాయ్..

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు గుంపులుగా, గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది. ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, శానిటైజర్ వాడాలని కోరింది. దీనివల్ల కోవిడ్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉంటుందని చెప్పింది. ప్రజలంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించేలా చూడాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కోవిడ్ విషయంలో నిబంధనల్ని మునుపటిలా కఠినతరం చేస్తున్నాయి. ఢిల్లీలో తాజాగా కొన్ని మార్గదర్శకాల్ని విడుదల చేశారు. దీని ప్రకారం.. ప్రజలంతా బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేకుంటే రూ.500 జరిమానా విధిస్తారు. ఢిల్లీతోపాటు మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Baby Powder: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ అమ్మకాలు వచ్చే ఏడాది నుంచి నిలిపివేత

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 16,561 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 5.44 శాతంగా ఉంది. అయితే, స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కోవిడ్ మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన చెందుతోంది.