HCA : అజార్‌పై వేటు ఖాయమేనా ? అపెక్స్ కౌన్సిల్ మీడియా సమావేశంపై ఉత్కంఠ

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. 2021, జూన్ 29వ తేదీ మంగళవారం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో అపెక్స్‌ కౌన్సిల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏం ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

HCA : అజార్‌పై వేటు ఖాయమేనా ? అపెక్స్ కౌన్సిల్ మీడియా సమావేశంపై ఉత్కంఠ

Hca Apex Council

HCA Apex Council : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదం ఇప్పట్లో సద్దుమణిగే పరిస్థితులు కనిపించడం లేదు. 2021, జూన్ 29వ తేదీ మంగళవారం సికింద్రాబాద్‌ జింఖానా గ్రౌండ్స్‌లో అపెక్స్‌ కౌన్సిల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏం ప్రకటన చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అజార్‌పై వేటు వేసే దిశగా అపెక్స్‌ కౌన్సిల్‌ అడుగులు వేస్తున్నట్లు కన్పిస్తోంది. వచ్చే నెల 18న అత్యవసర జనరల్‌ బాడీ మీటింగ్‌ జరగనుంది. ఈ సమావేశంలో వన్‌ బై థర్డ్‌ మెజార్టీతో అజార్‌పై వేటు వేసేందుకు అపెక్స్ కౌన్సిల్‌ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

భారత్‌కు సారధ్యం వహించిన అజారుద్దీన్‌ హెచ్‌సీఏ అధ్యక్షుడు అవడంతో ఆటగాళ్లకు మేలు జరుగుతుందని అందరూ భావించారు. కానీ ఆయన అడుగుపెట్టినప్పటి నుంచి వివాదాలే చుట్టుముట్టాయి. ఈ మధ్య ఈ వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే అజారుద్దీన్ స్థానంలో జాన్ మనోజ్‌ను తాత్కాలికి ప్రెసిడెంట్‌గా నియమించారు. జాన్ మనోజ్ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ హెచ్‌సీఏలో అజారుద్దీన్ సభ్యత్వం కూడా రద్దు చేసింది. అయితే ఇంకా తానే అధ్యక్షుడినని అంటున్నారు అజార్.

అజార్‌ హెచ్‌సీఏ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని అపెక్స్‌ కౌన్సిల్‌ ఆరోపిస్తోంది. షోకాజ్‌ నోటీసుల్లో దీనికి సంబంధించి 16కు పైగా ఆరోపణలు చేసింది. అజారుద్దీన్ దుబాయ్‌లో నార్తరన్ వారియర్స్ అనే ప్రవేట్‌ క్లబ్‌కు మెంటార్‌గా వ్యవహరించడం, హెచ్‌సీఏ ఈమెయిల్ ఐడీ పాస్‌వర్డ్ మార్చడంతో పాటు.. HCAకి చెందిన కెనరా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలని ఉద్దేశపూర్వకంగా లెటర్ పంపడం, సెలక్షన్‌ విషయంలో వేలు పెట్టడం… ఇలా అజార్‌పై చాలా ఆరోపణలే ఉన్నాయి. మరి ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో చూడాలి.