అరుదైన ఆపరేషన్ : పెద్దతలతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు

అరుదైన ఆపరేషన్ : పెద్దతలతో పుట్టిన శిశువును కాపాడిన వైద్యులు

Doctors save her life : సాధారణంగా అంత పెద్ద తలతో జన్మించిన శిశువు బతకటమే కష్టం. కానీ హైదరాబాద్ ఉస్మానియా నిలోఫర్ వైద్యులు అటువంటి పసిబిడ్డకు ప్రాణం పోశారు. ఇటువంటి అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యుల ఘనతను ప్రతిఒక్కరు ప్రశింస్తున్నారు. పెద్ద తలతో పుట్టిన ఆ బిడ్డకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు వైద్యులు.వివరాల్లోకి వెళ్తే… ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని కరంజి(టి) పంచాయతీ పరిధిలోని రాజుల్ వాడీ గిరిజన పల్లెకు చెందిన సువర్ణ అనే మహిళ అక్టోబర్ 26, 2020 న పెద్ద తలతో ఉన్న ఆడశిశువుకు జన్మిచ్చింది. అయితే, ఆ శిశువు తల పెద్దగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు హైడ్రోసెఫాలన్(తలలో నీళ్లు నిండి ఉండటం వల్ల) అనే వ్యాధితో పుట్టిందని గుర్తించారు. దీంతో ఆ బిడ్డ పుట్టిన అదే రోజున మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ కి తరలించారు.https://10tv.in/viral-pic-of-baby-removing-doctors-mask-becomes-symbol-of-hope/
ప్రస్తుతం నిలోఫర్ లో వైద్యులు ఆ బిడ్డకు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. ఆ పాప తలలో నుంచి నీటిని తొలిగించారు. ఇప్పుడు ఆ బిడ్డ బాగానే ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆ బిడ్డకు సర్జరీ చేసే అవకాశం ఉన్నట్లు భీంపూర్ మండల వైద్యాధికారి డాక్టర్ విజయసారథి తెలిపారు.అసలు బతకటమే కష్టమనుకున్న ఆపాపకు నిలోఫర్ వైద్యులు మెరుగైన వైద్యం అందింస్తున్నారని విజయసారథి చెప్పారు. అంతేకాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి సువర్ణను ప్రసవానికి ఐదురోజుల ముందే రిమ్స్ లో చేర్పించగా తల్లీ బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.