నెహ్రూ జూ పార్క్ లో బేబీ ఫీడింగ్ సెంటర్

జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు.  అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే.

  • Published By: veegamteam ,Published On : April 5, 2019 / 06:30 AM IST
నెహ్రూ జూ పార్క్ లో బేబీ ఫీడింగ్ సెంటర్

జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు.  అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే.

హైదరాబాద్: జూ పార్క్ కు వెళ్లేందుకు చిన్నారులే కాదు పెద్దవారు కూడా ఎగిరి గంతేస్తారు.  అసలే వేసవికాలం..చల్లగా ఉండటమ కాక జంతువులను చూసి ఆహ్లాదాన్ని పొందాలంటే జూ పార్క్ కు వెళ్లాల్సిందే. చిన్నారులతో వెళ్లాలంటే ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటారు తల్లులు. పాలు..వాటర్..స్నాక్స్ వంటివి పట్టుకెళుతుంటారు. ఈ క్రమంలో బిడ్డలకు తల్లులు ఆహారం తినిపించేందుకు..పాలిచ్చేందుకు  ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ప్రారంభించారు జూ నిర్వాహకులు. 
Read Also : నంబర్ ప్లేటు మారితే బుక్కైపోతారు

నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సభ్యుడు డాక్టర్ అనూప్ కుమార్ నాయక్ గురువారం (ఏప్రిల్ 4)న  ప్రారంభించారు. అంతేకాదు చిన్నారుల్ని అలరించేందుకు ఈ సెంటర్ లో  జంతువుల డిస్ ప్లేను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెల్స్, మునింద్ర, అదనపు పిసిసిఎఫ్ డాక్టర్ సిదానంద్ కుక్రెట్టి, డైరెక్టర్ జూ పార్క్ కూడా ఈ సందర్భంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ కార్యక్రమాలపై ఒక షో కూడా ఇచ్చారు.  
Read Also : బ్లేడుతో పనిలేదు: రాజకీయాలకు బండ్ల గణేష్ గుడ్‌బై