Telangana Govt Employs : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకునే వీలు లేకుండా పోయింది. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్యోగులు ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కనీసం 20 రోజులైనా పడుతుంది.

Telangana Govt Employs : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే

Telangana Govt Employs

Telangana Govt Employs : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. వేతనాలు పెంచినా, పెరిగిన జీతాలు అందుకునే వీలు లేకుండా పోయింది. కొత్త పీఆర్సీపై జీవోలు జారీ కాకపోవడంతో కొత్త వేతనాలు అందుకునే పరిస్థితి లేదు. ఇప్పటికిప్పుడు జీవోలు జారీ చేసినా ఉద్యోగులు ఆప్షన్లు తీసుకునే ప్రక్రియ కనీసం 20 రోజులైనా పడుతుంది. దీంతో ఈ నెల కూడా ఉద్యోగులకు పాత జీతాలే రానున్నాయి. సీఎం కేసీఆర్ కరోనా బారిన పడటంతో ఫైల్ పెండింగ్ లో ఉంది.

ఎన్నో ఆందోళనలు, అనేక వాయిదాలు, సుధీర్ఘ నిరీక్షణ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఉద్యోగుల వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ను అసెంబ్లీలో ప్రకటించారు. పెంచిన వేతనాలను ఏప్రిల్ నుంచి వర్తింపజేస్తామని ఆ సమయంలో సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ లెక్కన మే 1న తీసుకునే వేతనంలో పెరిగిన జీతం ఉద్యోగులకు అందాల్సి ఉంది. అయితే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో వేతనాల పెంపు ఫైల్ పై ఆయన సంతకం చేయలేదు. దీంతో మే నెలలో పెరిగిన వేతనాలను ఉద్యోగులకు అందుకోలేకపోయారు. అయితే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ వేతనాల పెంపు అమల్లోకి వస్తుందని అంతా భావించారు.

అయితే.. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ వేతనాల పెంపుకు సంబంధించిన ఫైల్ పై సంతకం చేయలేదు. దీంతో జూన్ 1న కూడా ఉద్యోగులు పాత వేతనాలనే అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా ఉద్యోగుల వేతనాలకు సంబంధించిన బిల్లులను తయారు చేయడం, వాటిని ట్రెజరీలకు పంపించడం లాంటి పనులను 20వ తేదీ వరకు పూర్తి చేస్తారు. అయితే ఇప్పటివరకు ఫిట్ మెంట్ కు సంబంధించిన పెంపు ఫైల్ పై సీఎం సంతకం చేయకపోవడంతో మే నెలకు కూడా పాత వేతనాల ప్రకారమే బిల్లులను రూపొందిస్తున్నారు అధికారులు.

దీంతో జూన్ లోనూ పాత వేతనాలే ఉద్యోగులకు అందనున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా ఉండడంతో సర్కార్ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ రాబడి తగ్గింది. ఈ నేపథ్యంలోనే వేతనాల పెంపును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిసింది. పరిస్థితులు చక్కబడిన అనంతరమే వేతనాల పెంపు ఫైల్ పై సీఎం సంతకం చేస్తారన్న అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.