Balapur Ganesh : రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..ఎంతో తెలుసా ?

అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. రికార్డు స్థాయిలో ధర పలికింది.

Balapur Ganesh : రికార్డు ధర పలికిన బాలాపూర్ లడ్డూ..ఎంతో తెలుసా ?

Laddu

Balapur Ganesh Laddu 2021 : అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. రికార్డు స్థాయిలో ధర పలికింది. బొడ్రాయి వద్ద నిర్వహించిన వేలం పాటలో పాల్గొన్న మర్రి శశాంక్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ లు  18 లక్షల 90 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. పోటాపోటీగా..లడ్డూ వేలం పాట కొనసాగింది. 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం ఉదయం లడ్డూ వేలం పాట కొనసాగించారు. అంతకంటే ముందు..వినాయకుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More : Ganesh Immersion : భాగ్యనగరంలో నిమజ్జన కోలాహలం..ట్యాంక్‌బండ్‌కు గణనాథుల క్యూ

లడ్డూకు కూడా పూజలు నిర్వహించిన అనంతరం వేలం పాట ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో…మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డి, ఇతర రాజకీయ నేతలు పాల్గొన్నారు. ఈసారి నిర్వహించిన వేలం పాటలో 35 మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ లడ్డూ వేలం పాటకు విశిష్టమైన చరిత్ర ఉంది. మర్రి శశాంక్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి మధ్య పోటాపోటీ వేలం పాట కొనసాగింది.

Read More : Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభం

బాలాపూర్‌లో వినాయకుడికి లడ్డూను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది. కానీ… వేలం మాత్రం 1994లో స్టార్టయింది. ఆ సంవత్సరం తొలిసారి కొలను మోహన్ రెడ్డి.. 450 రూపాయలకు వేలంలో కొనుగోలు చేశారు. 1995లోను ఆయనే రెండోసారి 4 వేల 500కు లడ్డూను దక్కించుకున్నారు. 1996లో కొలను కృష్ణారెడ్డి 18వేలకు, 1997లో 28వేలకు లడ్డూను సొంతం చేసుకున్నారు. 1998లో 51 వేలకు కొలను మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు, 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూను దక్కించున్నారు. 2002లో లక్షా 5వేలకు లడ్డూను దక్కించుకున్నారు కందాడ మాధవ రెడ్డి.

Read More : Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర
2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలు.
2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను గెల్చుకున్నారు.
2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకున్నారు.
2006లో చిగిరింత తిరుపతి రెడ్డి లడ్డూ ధరను 3లక్షలకు పెంచేశారు.
2007లో  రఘునందన్ చారి 4 లక్షల 15వేలకు దక్కించుకున్నారు.

Read More : Troffic Restrictions : గణేష్ నిమజ్జనం..సెప్టెంబర్ 19న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

2008లోఆ సంవత్సరం కొలను మోహన్ రెడ్డి 5లక్షల 7వేలకు మరోసారి లడ్డూను దక్కించుకున్నారు.2009లో 5లక్షల 15వేలకు బాలాపూర్ లంబోదరుడి ప్రసాదాన్ని సరిత దక్కించుకున్నారు.
2010లో కొడాలి శ్రీధర్ బాబు 5లక్షల 35వేలకు.
2011లో కొలన్ బ్రదర్స్ 5 లక్షల 45వేలకు సొంతం చేసుకున్నారు.
2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి 7లక్షల 50వేలకు దక్కించుకున్నారు.

Read More : Metro Trains : గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

2013లో తీగల కృష్ణారెడ్డి మరో 2లక్షలు పెంచేసి 9లక్షల 26వేలకు సొంతం చేసుకున్నారు.
2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9లక్షల 50వేలకు వేలం పాడారు.
2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32వేలకు లడ్డూను గెలుచుకున్నారు.
2016లో స్కైలాబ్ రెడ్డి.. 14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నారు.

Read More : Dasara Festival 2021 : అక్టోబర్ 7నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవములు

2017లో నాగం తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు పాట పాడి సొంతం చేసుకున్నారు.
2018లో శ్రీనివాస్ గుప్తా 16లక్షల 60వేలకు దక్కించుకున్నారు.
2019లో  కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకున్నారు.
2021 లో మర్రి శశాంక్ రెడ్డి 18 లక్షల 90 వేలకు దక్కించుకున్నారు.