Bandi Sanjay: జగన్‭తో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు.. బండి సంజయ్ విమర్శలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కిసాన్ సర్కార్ కాదని.. లిక్కర్ సర్కార్ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణనే తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే బయటకు రావాలని, టీఆర్ఎస్‌లో ఉంటే ఎప్పటికీ సీఎం కాలేరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.

Bandi Sanjay: జగన్‭తో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు.. బండి సంజయ్ విమర్శలు

Bandi Sanjay: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే వైసీపీ నేతలతో కలిసి సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుమార్తె కవిత లక్ష కోట్ల రూపాయల లిక్కర్ దందా చేశారని సంజయ్‌ ఆరోపించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నది బీజేపీ నినాదమని సంజయ్ అన్నారు.

Viral Video: స్టేజ్ మీదే వరుడి చెంప చెల్లుమనిపించిన వధువు.. అనంతరం ఇద్దరూ జుట్టు పట్టుకుని..

ఇక ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కిసాన్ సర్కార్ కాదని.. లిక్కర్ సర్కార్ అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి తెలంగాణనే తీసేసి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని మండిపడ్డారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకే కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు వెంటనే బయటకు రావాలని, టీఆర్ఎస్‌లో ఉంటే ఎప్పటికీ సీఎం కాలేరని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.