Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ యాక్షన్ ప్లాన్‌కు రెడీ..!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో కరీంనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ యాక్షన్ ప్లాన్ కు రెడీ అయింది.

Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ యాక్షన్ ప్లాన్‌కు రెడీ..!

Bandi Sanjay Arrest

Bandi Sanjay Arrest : తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో కరీంనగర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ హైకమాండ్ సీరియస్ అయింది. సంజయ్ అరెస్టుకు తీవ్రంగా నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పిలుపునిచ్చింది.. భవిష్యత్ కార్యాచరణపై బీజేపీ రాష్ట్ర నాయకులు చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి మరికొద్దిసేపట్లో బీజేపీ యాక్షన్ ప్లాన్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతరం మానకొండూరుకు పోలీసులు తరలించారు. అక్కడి నుంచి పీటీఎస్‌కు సంజయ్ తరలించారు. ఈ నేపథ్యంలో పీటీసీకి భారీ సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ ప్రకారం.. బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. బండి సంజయ్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారా? హైదరాబాద్ కు తరలిస్తారా? అనేది స్పష్టత లేదు. బండి సంజయ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే అంబులెన్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకైనా వెళ్తా : బండి సంజయ్ 
బండి సంజయ్ రిమాండ్‌పై నాన్ బెయిలెబుల్ కేసుల నమోదుకు పోలీసులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల అనంతరం రిమాండ్‌కు తరలించే అవకాశం కనిపిస్తోంది. బండి సంజయ్‌ను రిమాండ్ చేసేందుకు పోలీసులు సిద్దమవడం పట్ల కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. సంజయ్‌ను బేషరతుగా విడుదల చేయాలంటూ కరీంనగర్‌కు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తునా వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల కోసం జైలుకైనా వెళ్తానని బండి సంజయ్ ప్రకటించారు. ఎంతదాకానైనా తాను పోరాడేందుకు సిద్ధమని అన్నారు.

మరోవైపు.. బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ను హౌజ్ అరెస్ట్ చేయడానికి ఆయన ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తోంది. బండి సంజయ్‌కి మద్దతుగా కరీంనగర్ వెళ్లకుండా పోలీసులు ఆయన్ను హౌజ్ అరెస్ట్ చేశారు. బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నల్లు ఇంద్రసేనారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బండి సంజయ్‌ జన జాగరణ దీక్ష చేపట్టారు. ఆదివారం రాత్రి పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ను చూసేందుకు వెళ్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారంటూ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ  క్రమంలోనే మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్‌ను పోలీసులు తరలించారు.

Read Also : Bandi Sanjay: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బండి సంజయ్.. కేంద్రం దృష్టికి వ్యవహారం..!