Bandi Sanjay: పంతాలు, పట్టింపులకు పోయి సమస్యను పరిష్కరించకుంటే చూస్తూ ఊరుకోం..

రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్‌గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని బండి సంజయ్ తెలిపారు.

Bandi Sanjay: పంతాలు, పట్టింపులకు పోయి సమస్యను పరిష్కరించకుంటే చూస్తూ ఊరుకోం..

Bandi Sanjay

TS BJP President Bandi Sanjay: రేషన్ డీలర్ల డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గుచేటని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమని అన్నారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని హామీ ఇచ్చారని, ఈమేరకు జూన్ ఫస్ట్‌న జీవోలను విడుదల చేస్తామని చెప్పారని, నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చిందని బండి సంజయ్ అన్నారు.

Bandi Sanjay: టీడీపీ-బీజేపీ మళ్లీ కలుస్తాయన్న ఊహాగానాలపై స్పష్టతనిచ్చిన బండి సంజయ్

రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 91లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు కోవిడ్ టైంలోకూడా ప్రాణాలకు తెగించి పనిచేశారని తెలిపారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే.. తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని బండి సంజయ్ గుర్తు చేశారు.

Bandi Sanjay : బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు : బండి సంజయ్

రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్‌లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని, ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్‌గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని సంజయ్ తెలిపారు. అయినా ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గమని సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోందని అన్నారు.

Bandi Sanjay : ఓఆర్ఆర్ టోల్ టెండర్ అప్పగింతలో అవకతవకలు.. సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ

వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మునంతా కేంద్రమే చెల్లిస్తోందని, వడ్లను సేకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తోందని అన్నారు. అయినా నేటికీ రైతుల నుండి వడ్లను కొనుగోలు చేయకుండా కల్లాల వద్ద పడిగాపులు కాసేలా చేస్తూ వాళ్ల ఉసురు తీస్తోందని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేషన్ డీలర్లతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించాలని, పంతాలు, పట్టింపులకు పోయి సమస్యను పరిష్కరించకుండా పేదల నోటికాడ ముద్దను లాక్కోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.