Telangana : మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు : బండి సంజయ్

 సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిచేశారు? మాట్లాడతే మిషన్ భగీరథ తో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని అటువంటి పథకాన్ని దేశం అంతా అమలు చేస్తామని చెబుతుంటారని అసలు మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకటానికి కూడా పనికిరావు అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Telangana : మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు : బండి సంజయ్

Bandi Sanjay Fires on CM KCR False Comments

Telangana : సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏం చేశారు? రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధిచేశారు? మిషన్ భగీరథ తో తెలంగాణ అంతా నీళ్లిచ్చామని అటువంటి పథకాన్ని దేశం అంతా అమలు చేస్తామని చెబుతుంటారని అసలు మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకటానికి కూడా పనికిరావు అంటూ బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ నీళ్లు బురద బురదగా వస్తున్నాయని తన పాదయాత్రలో ఈ విషయాన్ని గుర్తించానని ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని మిషన్ భగీరథ నీళ్లు బట్టలు ఉతకడానికి కూడా పనికిరావు అనే విషయాన్ని తాను నిరూపిస్తానంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ పేరుతో రూ.30,40 వేల కోట్ల రూపాయల్ని కేసీఆర్ నాశనం చేశారని ఈ పథకం ఎందుకు పనికిరాదంటూ బండి సంజయ్ విమర్శించారు.

తెలంగాణలో అధికారం రావటానికి ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ ఏమీ నెరవేర్చలేదని యువతకు ఉద్యోగాలు కల్పించటంలో కూడా విఫలమయ్యారని కానీ రాష్ట్రం సాధించుకున్నాక అధికారంలోకి వచ్చి కేసీఆర్ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారంటూ బండి విమర్శలు సంధించారు. రుణమాఫీలు చేస్తానని ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వటంలేదని డీఏలు ఇవ్వకుండా చేయటమేనా అభివృద్ధి అంటే అని ప్రశ్నించారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది? హైదరాబాద్ లో ఉన్న భూముల్ని అమ్ముకుని దోచేసుకున్నారని..ఆర్టీ ఆస్తుల్ని కూడా అమ్ముకున్న ఘతన కేసీఆర్ కు మాత్రమే దక్కుతుందని అని విమర్శించారు. ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయటం తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాదని అభివృద్ధి గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఎదురు మాటల దాడిచేయటం మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది అంటూ బండి సంజయ్ విమర్శించారు.