Bandi Sanjay: ఐదో విడద పాదయాత్రకు సిద్ధమవుతున్న బండి సంజయ్.. 28 నుంచి ప్రారంభం

ఇప్పటికే నాలుగు విడతలుగా పాదయాత్ర పూర్తి చేసుకున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత యాత్రకు రెడీ అవుతున్నారు. ఈ నెల 28 నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు.

Bandi Sanjay: ఐదో విడద పాదయాత్రకు సిద్ధమవుతున్న బండి సంజయ్.. 28 నుంచి ప్రారంభం

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నాలుగు విడతల పాద యాత్ర పూర్తి చేసిన బండి సంజయ్ వచ్చే వారం నుంచి మరో విడత యాత్ర చేపట్టబోతున్నారు. ఈ నెల 28 నుంచి ఈ యాత్ర మొదలవుతుంది.

Sabarimala Pilgrims: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. విమానంలో ఇరుముడి తీసుకెళ్లేందుకు అనుమతి

బాసరలో సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, భైంసా వెళ్తారు. అక్కడి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభిస్తారు. డిసెంబర్ 15 లేదా 16 వరకు ఈ యాత్ర సాగుతుంది. బండి సంజయ్ సొంత నియోజకవర్గమైన కరీంనగర్‌లో యాత్ర ముగింపు సభ నిర్వహిస్తారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా బండి సంజయ్ ఈ యాత్ర చేపట్టారు. ఇప్పటికే తెలంగాణలోని 21 జిల్లాల్లో 1178 కిలోమీటర్ల మేర, నాలుగు విడతలుగా యాత్ర పూర్తైంది. మొత్తం 13 లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగింది. నిజానికి ఐదో విడత పాదయాత్ర గత అక్టోబర్‌లోనే చేయాల్సి ఉంది. అయితే, మునుగోడు ఉప ఎన్నిక కారణంగా వాయిదా పడింది.

T20 World Cup 2024: రాబోయే టీ20 వరల్డ్ కప్‌లో మార్పులు.. పోటీలో 20 జట్లు.. నాలుగు గ్రూపులు

బండి సంజయ్ ఒకవైపు యాత్ర చేస్తుంటే, మరోవైపు పార్టీ తరఫున ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’ పేరుతో పార్టీ ఆధ్వర్యంలో మరో యాత్ర సాగనుంది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 14 వరకు ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా వివిధ పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపడుతారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు ప్రజల్లోనే ఉండాలనే పార్టీ పెద్దల సూచన మేరకు తెలంగాణ బీజేపీ ఈ కార్యక్రమాలు కొనసాగిస్తోంది.