Bandi Sanjay Kumar : ప్లీజ్.. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తరిమి తరిమి కొడతాం-బండి సంజయ్

Bandi Sanjay Kumar: 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి.

Bandi Sanjay Kumar : ప్లీజ్.. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తరిమి తరిమి కొడతాం-బండి సంజయ్

Bandi Sanjay Kumar

Bandi Sanjay Kumar : బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కోరారు. ఈ రజాకార్ల పాలనను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొడతామన్నారు. వరంగల్ నగరంలోని హనుమకొండ అంబేద్కర్ సెంటర్ లో నిరుద్యోగ మార్చ్ ముగింపు ర్యాలీలో బండి సంజయ్ మాట్లాడారు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నన్ను అరెస్ట్ చేసిన చోటే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నాం అని బండి సంజయ్ అన్నారు. పోరుగల్లు గడ్డ నుండే కాషాయ పోరు మొదలైందన్నారు.

” కష్టపడి చదువుకున్న బిడ్డల జీవితాలు ఆగం అయ్యాయి. కేసీఆర్ కపట నాటకాలను బరిద్దామా..? తెగించి కొట్లాడుడే. 30లక్షల మంది యువత జీవితాలు నాశనం చేసింది ఈ పార్టీ. ఏ పేపర్ లీకైనా బండి సంజయ్ అంటున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది. సీఎంకు సెంటిమెంట్ లేదు.
రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లి సమయంలో అరెస్ట్ చేశారు. నా అత్త దశదిన కర్మ జరుగుతుంటే అరెస్ట్ చేశారు.

పేపర్ లీక్ పై దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. బీజేపీ చేస్తున్న పోరాటంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో సహా అన్ని పార్టీలు కలిసి రావాలి. రాజశ్యామల యాగం కోసం కాలు విరిగిందని నాటకం ఆడారు. 30లక్షల మంది యువత భవిష్యత్తు ఆగమైనా.. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుండి బయటకు రాలేదు. ఈ మూర్కుడి పాలన కోసం పోరాడి తెలంగాణ సాధించుకున్నామా అని నిరుద్యోగులు తల్లడిల్లిపోతున్నారు.

Also Read..Revanth Reddy : దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు, అధికారంలోకి రాగానే రూ.2లక్షలు మాఫీ, 2లక్షల ఉద్యోగాలు-రేవంత్ రెడ్డి

మీ కోసం చావడానికైనా సిద్ధం. నీ కొడుకు ట్విట్టర్ టిల్లు రాజీనామా చేయాలి. నిరుద్యోగ మార్చ్ కు స్పందన లేదన్న వారు కంటి ఆపరేషన్ చేసుకోండి. పది ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్ ఉంటుంది. భాగ్యనగర్ లో మిలియన్ మార్చ్ ఉంటుంది. సిట్ అట్టర్ ఫ్లాప్. సిట్ ను మేము ఒప్పుకోము. సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. TSPSC కమిషన్ ను రద్దు చేయాలి. నాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుంది. కేసీఆర్.. పేద విద్యార్థుల ఉసురు పోసుకుంటున్నాడు.

ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఈ రజాకార్ల పాలనను తెలంగాణ పొలిమేరల వరకు తరిమికొడతాం. మళ్ళీ ఆంధ్రా – తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ముట్టుకునే అర్హత ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదు” అని ఫైర్ అయ్యారు బండి సంజయ్.

Also Read..Ambedkar statue: చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతా: సీఎం కేసీఆర్