Bandi Sanjay Released: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. కేసీఆర్‌కు కృతఙ్ఞతలు

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీఓ రద్దు చేయాలంటూ బండి సంజయ్ ఇటీవల జాగరణ దీక్ష చేపట్టారు.

Bandi Sanjay Released: జైలు నుంచి విడుదలైన బండి సంజయ్.. కేసీఆర్‌కు కృతఙ్ఞతలు

Bandi Sanjay Released

Bandi Sanjay Released : బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీఓ రద్దు చేయాలంటూ బండి సంజయ్ ఇటీవల జాగరణ దీక్ష చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక ఈ రోజు రిమాండ్ ఎత్తివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఈ సాయంత్రం బండి సంజయ్ కరీంనగర్ జైలునుంచి విడుదలయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తానూ జైలు నుంచి బయటకు రావడానికి కృషిచేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. సంజయ్.. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. తనను జైలుకు పంపినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక కృతఙ్ఞతలు చెబుతున్నానని బండి సంజయ్ అన్నారు. జైలుకు వెళ్లడం బీజేపీ నేతలకు కొత్త కాదన్నారు. తాను జైలుకుపోవడం తొమ్మిదో సారని తెలిపారు.

ఎన్నికేసులైనా పెట్టుకో కానీ.. వెంటనే జీవో 317 సవరించాలని కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. 317 జీవో సవరించే వరకు పోరాటం ఆపబోమని… ఖబడ్దార్ కేసీఆర్ అంటూ హెచ్చరించారు. ఉద్యోగ సంఘాలు భయపడొద్దని.. బీజేపీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ సమాజం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. అక్రమ కేసులకు భయపడబోమన్నారు.