ప్రభుత్వ వైఖరి వల్లే ఓటింగ్ శాతం తక్కువైంది: బండి సంజయ్

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి అమిత్ షా, యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, మరో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఈ మేరకు పార్టీ ఓట్లు భారీగా వస్

ప్రభుత్వ వైఖరి వల్లే ఓటింగ్ శాతం తక్కువైంది: బండి సంజయ్

Bandi Sanjay

GHMC election: గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ నుంచి అమిత్ షా, యూపీ నుంచి యోగి ఆదిత్యనాథ్, మరో కేంద్ర మంత్రి అమిత్ షా బీజేపీ ప్రచారానికి హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఈ మేరకు పార్టీ ఓట్లు భారీగా వస్తాయని, ఎన్నికల్లో అద్భుత ఫలితాలు వస్తాయని అంచనా వేసిన బీజేపీకి అసంతృప్తి మిగిలింది. తమ కార్యకర్తలపై జరిగిన దాడి పట్ల అసహనం వ్యక్తం చేసింది.

బీజేపీ కార్యకర్తల మీద దాడి చేస్తుంటే చూసి చూడనట్లు వదిలేస్తుంది ప్రభుత్వం. ఇంత అరాచకం జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూనే ఉంది. అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి గెలిచిందో చూస్తూనే ఉన్నారు.

పోలీస్ అధికార యంత్రంగాన్ని శాంతి భద్రతలకు కాకుండా మీ కోసం వాడుకుంటున్నారు. భారతీయజనతా పార్టీ కార్యకర్తల మీద చాలా చోట్ల దాడులు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వచ్చి దాడి చేశాడు. ఆ వ్యక్తి కోసం హాస్పిటల్ కు వెళ్లొచ్చా. అక్కడ సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తాం. అవి మాయం చేయాలనుకుంటే బాగుండదు.

సీఎం డైరక్షన్లో ఎన్నికల సంఘం పని చేసింది. ఈసీ నిర్లక్ష్యం వల్లే ఓటింగ్ శాతం తగ్గింది. ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర జరిగింది. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ఆగడాలను అడ్డుకుంటామని బీజేపీ ముందుకొచ్చింది. నియంత పాలన పోకడను అడ్డుకుంటాం. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు.