Bandi Sanjay : బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు : బండి సంజయ్

రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు.

Bandi Sanjay : బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు : బండి సంజయ్

Bandi Sanjay (8)

BJP Support : బీజేపీ మద్దతుతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. 1400 మంది బలిదానాలతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో బీజేపి ప్రధాన పాత్ర పోషించిందని చెప్పారు. అనేక రంగాల్లో రాష్ట్ర అబివృద్ధికి మోదీ ప్రభుత్వం సహకరిస్తోందని తెలిపారు. 9 ఏళ్ల కాలంలో కేంద్రం రాష్ట్రానికి 4 లక్షల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీలు వివేక్, రవీంద్ర నాయక్, సీనియర్ నేత ఇంద్రసేనా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మూర్ఖత్వపు పాలన కొనసాగుతోందని విమర్శించారు. నలుగురి కోసం మాత్రమే రాష్ట్రం ఏర్పడినట్టు ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషం తప్పా… రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బాధతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు.

CM KCR : తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించడం నా అదృష్టం : సీఎం కేసీఆర్

బీజేపీ అధికారంలోకి రాగానే ఫీజ్ రీయింబర్స్ మెంట్ ముందుగానే చెల్లిస్తామని వెల్లడించారు.ఉచిత విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. నిలువ నీడ లేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు చేపడతామని వెల్లడించారు. పంట నష్టపరిహారం రూ.10 వేలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని విమర్శించారు. కేసీఆర్ ఇవ్వడు.. ఇంకొకరిని ఇవ్వనివ్వడని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పసల్ భీమాను రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పారు. నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని..ఇంతకంటే దుర్మార్గం మరోటి ఉంటుందా అని అన్నారు. కొంతమంది ఉద్యోగులు తనకు ఫోన్ కాల్స్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎంవో నుంచి వచ్చిన స్క్రిప్ట్ ను ఉద్యోగులు చదవాలని బెదిరిస్తున్నారంటూ వాపోతున్నారని పేర్కొన్నారు. 21 రోజుల పాటు రోజుకో డిపార్ట్ మెంట్ బీఅర్ఎస్ కు ప్రచారం చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.

Minister Srinivas Goud : ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

అందుకే జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. కాంగ్రెస్ ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ కూడా రాలేదని ఎద్దేవా చేశారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తే బీఅర్ఎస్, కాంగ్రెస్ కు అభ్యర్థులు గల్లంతయ్యారని పేర్కొన్నారు. అనేక మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అయిందన్నారు. కాంగ్రెస్ ను పైకి లేపే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్నారు.

బీజేపీ అడ్డుకుంటే ఆగే పార్టీ కాదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ సహకరించినా కేసీఆర్ దానికి సిద్ధంగా లేరని విమర్శించారు. బీజేపీని చూసి తట్టుకోలేక కేసిఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి రాష్ట్రం దాటారని పేర్కొన్నారు. గడిల పాలనను అంతమొందించడానికి బీజేపీ ముందడుగు వేస్తోందని తెలిపారు. ఒక కుటుంబం చేతిలో బంది అయిన తెలంగాణ తల్లిని విడిపించడానికి బీజేపీని రాష్ట్ర ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.