Bandi Sanjay : హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, వరంగల్ సీపీపై ఫిర్యాదు చేసే ఛాన్స్

Bandi Sanjay: రాష్ట్రంలోని పరిణామాలపై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. పలువురు ముఖ్య నేతల చేరికలపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Bandi Sanjay : హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి బండి సంజయ్, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం, వరంగల్ సీపీపై ఫిర్యాదు చేసే ఛాన్స్

Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే హస్తినలో చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఉన్నారు. రాష్ట్రంలోని పరిణామాలపై కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు పలువురు ముఖ్య నేతల చేరికలపైనా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Also Read..Telangana Politics : జూపల్లి, పొంగులేటిలను బీజేపీలో చేర్చుకోవటానికి ఈటల యత్నాలు, ఢిల్లీ పెద్దలతో మంతనాలు

అటు వరంగల్ సీపీ రంగనాథ్ పై హోంశాఖకు బండి సంజయ్ ఫిర్యాదు చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే రంగనాథ్ పై బండి సంజయ్ ఫైల్ సిద్ధం చేశారు. తనను అరెస్ట్ చేసిన విధానంపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

పార్టీ అధిష్టానం పిలుపుతోనే బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో చాలా వేగంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి సంబంధించి కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నింటిపై పార్టీ హైకమాండ్ తో చర్చించేందుకు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఇప్పటికే పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇదివరకే ఢిల్లీలో ఉన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కానున్నారని, తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారని సమాచారం.(Bandi Sanjay)

ఈ ఏడాది చివరలోనే ఎన్నికలు ఉండటంతో.. కీలకమైన నేతలందరినీ పార్టీలో చేర్చుకున్నట్లు అయితే, పార్టీ మరింత బలోపేతం అవుతుందని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకు తగ్గట్టునే బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లాలు, ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ప్రభావం ఎక్కువగా చూపగలిగే జూపల్లి కృష్ణారావు.. వీరి చేరికపై బీజేపీ హైకమాండ్ తో చర్చించే అవకాశం ఉంది.

అయితే, వారిద్దరి నుంచి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. వాటన్నింటిపై పార్టీ హైకమాండ్ చర్చించనుంది. ఈ అంశాలకు సంబంధించి ఈటల రాజేందర్ ఢిల్లీ పెద్దల ముందు ఒక రోడ్ మ్యాప్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానంగా వీటిపైన డిస్కషన్ చేయడానికే.. బండి సంజయ్ ని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది.

సీపీ రంగనాథ్‌పై ఫిర్యాదు చేసే అవకాశం..
మరోవైపు వరంగల్ సీపీ రంగనాథ్ వ్యవహారశైలిపై బండి సంజయ్ హోంశాఖకు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక పార్లమెంటు సభ్యుడు అయిన తనపై తనపై వరంగల్ సీపీ ఆరోపణలు చేయడం, అరెస్ట్ చేసిన విధానం కరెక్ట్ కాదని బండి సంజయ్ అంటున్నారు. అటు, సీపీ రంగనాథ్ పై బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రగతిభవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కుట్రపూరితంగా సీపీ రంగనాథ్ తనపట్ల వ్యవహరించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.(Bandi Sanjay)

Also Read..Khammam constituency politics : ఖమ్మంలో బీఆర్ఎస్ Vs పొంగులేటి పొలిటికల్ ఫైట్.. శీనన్నదారి ఎటు? గులాబీ గూటికా? హస్తం నీడకా?

 

టెన్త్ హిందీ పేపర్ కు సంబంధించి తనపై ఎలాంటి అభియోగాలు లేకున్నా.. పొలిటికల్ గేమ్ లో భాగంగా కావాలనే తనపై ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. తన ఫోన్ ను పదే పదే అడగటం కూడా కుట్రలో భాగమే అంటున్నారు బండి సంజయ్. ఢిల్లీకి చెందిన ముఖ్య నేతలతో తాను మాట్లాడానని, ఆ సమాచారం తీసుకోవడం కోసమే సీపీ రంగనాథ్ ఇలా తన ఫోన్ గురించి పట్టుబట్టారని బండి సంజయ్ చెబుతున్నారు. తనపై బురద చల్లే ప్రయత్నం చేశారని, కాబట్టి కచ్చితంగా సీపీ రంగనాథ్ పై ప్రివిలేజ్ కమిటీకి కూడా ఫిర్యాదు చేయాలని బండి సంజయ్ భావిస్తున్నారు.