Bandi Sanjay : సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు.

Bandi Sanjay : సీఎం కేసీఆర్, అసదుద్దీన్ ఓవైసీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay (4)

Bandi Sanjay : సీఎం కేసీఆర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హింసించే రాజు 23వ పులకేసి తరహాలో ఎనిమిదవ హింసించే పులకేసి కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డగా మారిందన్నారు. హైదరాబాద్ లో మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ లో ఆరుగురు ఉగ్రవాదులను పట్టుకున్నారని తెలిపారు. హెచ్ సీ సంస్థ ఐసిస్ కన్నా ప్రమాదకరమైందని అన్నారు. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని పేర్కొన్నారు.

రోహింగ్యాలు, పాకిస్థానీలకు మజ్లిస్ స్థావరం కల్పిస్తుందని ఆరోపించారు. నిన్న పట్టుబడిన మహమ్మద్ సలీమ్ కీలక వ్యక్తి అని వెల్లడించారు. మహమ్మద్ సలీమ్.. ఓవైసీ కుటుంబానికి చెందిన మెడికల్ కాలేజీ బయోటెక్నాలజీ విభాగనికి హెచ్ఒడి గా ఉన్నారని పేర్కొన్నారు. ఎంఐఎంకి ఉగ్రవాదులతో సంబంధం ఉందా లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు స్థావరం ఇస్తానని, బెయిల్ ఇస్తానని 2016లో అసదుద్దీన్ మాట్లాడారని తెలిపారు.

Bandi Sanjay : జేపీఎస్ లను రెగ్యులరైజ్ చేయకుండా మోసగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం : బండి సంజయ్

రోహింగ్యాలు, పాకిస్థానీలను తరమడానికి సర్జికల్ స్ట్రైక్ చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చెప్పామని పేర్కొన్నారు. ఓవైసీ ఆస్పత్రిలో ఉగ్రవాదులకు ఉద్యోగాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఐసిస్, ఇతర ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ప్లేస్ హైదరాబాద్ అని, వారికీ షెల్టర్ ఇచ్చేది ఎంఐఎం అని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఎంఐఎం ఉగ్రవాద పార్టీ అని తెలుసా? తెలియదా? లేక రాజకీయాల కోసమే కలుస్తున్నారా? అని ప్రశ్నించారు.

వీసా గడువు పూర్తైనా పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారు ఇంకా ఇక్కడే ఉన్నారని వెల్లడించారు. హైదరాబాద్ ప్రజల ప్రాణాలు బాంబుల మీద ఉన్నాయని, అవి ఎప్పుడు పేలుతాయో తెలవని పరిస్థితి నెలకొందన్నారు. వీరికి అనంతగిరి కొండల్లో శిక్షణ ఇస్తున్నారని.. అక్కడ శిక్షణ ఇస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఇక్కడి పోలీసులకు ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే.. మధ్యప్రదేశ్ పోలీసులు ఇక్కడి పోలీసుల సహకారంతో వారిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. కొత్త తరహా జిహాద్ ఉగ్రవాదం బీఆర్ఎస్ సహకారంతో ఎంఐఎం ప్రోద్బలంతో జరుగుతుందన్నారు.

Bandi Sanjay: అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం: బండి సంజయ్

హిందువులను ముస్లింలుగా మార్చి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు. ఉగ్రవాదం నుండి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చేతిలో ఉందన్నారు. తెలంగాణ పోలీసులు హీరోలని.. రాష్ట్ర ప్రభుత్వం వారి డ్యూటీ వారిని చేసుకోనివ్వడం లేదని విమర్శించారు. వారిని స్వేచ్ఛగా డ్యూటీ చేసుకోనిస్తే ఇలాంటి దాడులు జరుగవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు. సీఎం అవినీతి చిట్టా సోమేశ్ కుమార్ కు తెలుసు కాబట్టే ఎక్కడ బయటపెడుతాడో అని ఆయనను ముఖ్య సలహాదారుగా నియమించుకున్నాడని విమర్శించారు.

హైకోర్టు మొట్టికాయలు వేసినా సోమేశ్ కుమార్ ను మళ్ళీ తెచ్చి పెట్టుకున్నారని వెల్లడించారు. 500 మంది రిటైర్డ్ ఉద్యోగుల వరకు మళ్ళీ అవకాశం కల్పించాడాని.. వారికి జీతభత్యాలు, అలవెన్స్, ఆఫీస్ ఖర్చులతో ప్రతి ఏడాది రూ.1000 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. కర్ణాటకలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. అక్కడి నాయకులతో మాట్లాడిన పంచాయతీ సెక్రెటరీలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. పంచాయతీ సెక్రెటరీలది న్యాయబద్ధమైన డిమాండ్ అని పేర్కొన్నారు.

Bandi Sanjay : అక్కడ కచ్చితంగా బీజేపీ గెలుస్తుంది, తెలంగాణ సచివాలయంలో మార్పులు చేస్తాం-బండి సంజయ్

అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 4 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ పూర్తైన వారిని రెగ్యులైజ్ చేయాలన్నారు. కరీంనగర్ సీపీ బెదిరింపులకు పాల్పడుతున్నాడని.. ఆయన ఉద్యోగం ఊడుతుందని హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో సకల జనుల సమ్మెలో కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదని.. ఇప్పుడు ఉద్యోగులను హింసిస్తున్నారని మండిపడ్డారు. ఓఆర్ఆర్ పై సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం చెప్పాలన్నారు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గురువారం నిరుద్యోగ మార్చ్ ఉంది.. అన్ని జిల్లాలో నిర్వహిస్తున్నామని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ముఖ్యమంత్రి కొడుకును భర్తరఫ్ చేయాలని.. అభ్యర్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని సూచించారు.