Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి

జనవరి 20న బండి భగీరథ్‌ను మహీంద్రా యూనివర్సిటీ సస్పెండ్ చేసింది. యూనివర్సిటీలోకి ప్రవేశం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని భగీరథ్ కోర్టుకు తెలిపాడు.

Bandi Sanjay: బండి సంజయ్ తనయుడికి ఊరట.. యూనివర్సిటీ సస్పెన్షన్‌పై స్టే.. పరీక్షలకు అనుమతి

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్‌కు ఊరట లభించింది. భగీరథ్‌ను సస్పెండ్ చేస్తూ మహీంద్రా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. అలాగే అతడు పరీక్షలు రాసేందుకు అనుమతించింది. జనవరి 20న బండి భగీరథ్‌ను మహీంద్రా యూనివర్సిటీ సస్పెండ్ చేసింది.

Rahul Press meet: నేను సావర్కర్ కాదు, గాంధీని.. ‘సారీ’పై రాహుల్ సెటైర్లు

యూనివర్సిటీలోకి ప్రవేశం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనను ఎలాంటి వివరణ అడగకుండానే యూనివర్సిటీ సస్పెండ్ చేసిందని భగీరథ్ కోర్టుకు తెలిపాడు. ఇంటర్నల్ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరాడు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తాజాగా భగీరథ్ సస్పెన్షన్‌పై స్టే విధించింది. అతడు పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని మహీంద్రా యూనివర్సిటీని ఆదేశించింది. మార్చి 9న హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

దీంతో హైకోర్ట్ అదేశాలను అనుసరించి బండి భగీరథ్ పరీక్షలకు హాజరయ్యాడు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా భగీరధ్‌ను క్లాస్ రూమ్‌లోకి అనుమతించాలని యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. కొంతకాలం క్రితం బండి భగీరథ్ తోటి విద్యార్థిపై దాడి చేసిన వీడియో ఒకటి వైరల్ అయిన సంగతి తెలిసిందే.