Bathukamma 2022 : బతుకమ్మ పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలలో ఔషధ గుణాలు

రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ. పూలనే గౌరీదేవిగా పూజించే అపురూపమైన పండుగ. ప్రకృతితో మమైకం అయ్యే అద్భుతమైన పండుగ. తెలంగాణ బతుకమ్మ పండుగకు ముస్తాబయ్యింది.

Bathukamma 2022 : బతుకమ్మ పేర్చే ఒక్కో పువ్వుకి ఒక్కో అర్థం.. ఆ పూలలో ఔషధ గుణాలు

Bathukamma 2022 : రంగురంగు పూలతో చేసుకునే పూల పండుగ. పూలనే గౌరీదేవిగా పూజించే అపురూపమైన పండుగ. ప్రకృతితో మమైకం అయ్యే అద్భుతమైన పండుగ. చిన్నా పెద్ద, పేద, ధనిక అనే బేధభావనలు లేకుండా గౌరమ్మను తన్మయత్వంతో ఆరాధించే పండుగ బతుకమ్మ. తెలంగాణ బతుకమ్మ పండుగకు ముస్తాబయ్యింది. ఆశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను తొమ్మిది రోజుల పాటు ఆడబిడ్డలు ఆటపాటలతో ఉత్సాహంగా జరుపుకుంటారు. తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూలతో అలంకరించి బతుకమ్మను పేరుస్తారు.

అయితే బతుకమ్మలో ఉపయోగించే పూలకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక్కో పువ్వుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఒక్కో అర్థం ఉంది. బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి ప్రతీక. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. ఏమేమీ పువ్వొప్పనే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పనే గౌరమ్మ అంటూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతారు. అటువంటి అందాల అరుదైన బతుకమ్మ పూల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం..బతుకమ్మలో ఉపయోగించే ప్రతి పువ్వు ఆరోగ్యానికి, అందానికి ఎంతగానో తోడ్పడుతాయి. మరి ఆ పూలు ఏంటో..వాటి ప్రత్యేకతలేంటో.. వాటితో వచ్చే లాభాలేంటో తెలుసుకుందామా..

Senna pendula flower NC2 | Introduced yearlong-green perenni… | Flickr

తంగేడు పూలు..
బతుకమ్మ ముందు వరసలో ఉండేవి తంగేడు పూలు, పసిడి వర్ణంలో మెరిసే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. జ్వరం, మలబద్దకానికి ఇది మంచి ఔషదం. తంగేడు పూలని ఆరబెట్టి దాంట్లో ఉసిరికాయ పొడి, పసుపు సమాన భాగాలుగా తీసుకొని కలపాలి. దీన్ని రెండు పూటలా తినడానికి అరగంట ముందు గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి. తంగేడు పువ్వు తెలంగాణ రాష్ట్ర పుష్పం.

తామర గింజలు బరువును తగ్గిస్తాయట.. డయాబెటిస్‌‌ని కూడా..?

తామర పూలు..
తామర పువ్వు అందానికి, స్వచ్ఛతకు ప్రతీక. దీన్ని రక్తస్రావ నివారణకు ఉపయోగిస్తారు. సుగంధ ద్రవ్యాల తయారీకి, మలబద్దకంతో బాధపడేవారికి తామర తైలం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తామర పువ్వు రేకులు, కుంకుమపుప్పు, కలువ పువ్వులతో కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పువ్వుతో అనేక చర్మ సంబంధ వ్యాధులను నివారించవచ్చు.

Gunugu Puvvulu : గునుగు పువ్వులను చూసి పనికిరాని పూలు అనుకుంటున్నారా?  వాటిలోని ఔషధ గుణాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు?

గునుగు పూలు..
గునుగు పువ్వు గడ్డిజాతికి చెందిన పువ్వు. దీన్ని అతిసార నివారణకు మందుగా వాడుతారు. ఇక బతుకమ్మ అలంకరణలో గునుగు పువ్వు ఎంతో శోభను ఇస్తుంది. ఈ పువ్వును చర్మంపై గాయాలు, పొక్కులు, క్షయవ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. రక్త పోటును అదుపులో ఉంచడంలో దీనికి మరేది సాటిరాదు. ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజుల్లో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ బాగా నీటితో నిండి ఉంటాయి. ఇక రకరకాల పువ్వులు రంగు రంగులో విరబూసి ఉంటాయి. బంతి, చేమంతి, నంది వర్ధనం గునుగు పూలు, తంగేడు పూలు అలా రకరకాల పూలను ఉపయోగించి బతుకమ్మను పేరుస్తారు.

Plants used for Ganapathi puja; Medicinal plants and Poisonous plants  around us: పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత

గుమ్మడి పువ్వు..
గుమ్మడి పువ్వు బతుకమ్మలో ప్రధమస్థానం. గుమ్మడి పువ్వునే గౌరమ్మగా భావించి పూజిస్తారు. ఆరాధిస్తారు. గుమ్మడి పువ్వులో ఎ, సి విటమిన్లు ఉంటాయి. దీని సైంటిఫిక్​ పేరు ‘కుకుంబిటాపిపో’. వయసు మీద పడ్డాక వచ్చే కాళ్ల నొప్పుల్ని తగ్గిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. డ్రై స్కిన్​ ఉన్నవాళ్లు వాడితే స్కిన్​కి చాలా మంచిది.

Pin on colorful

కట్ల పువ్వు..
కట్ల పువ్వు నీలి రంగులో ఉంటుంది. దీని సైంటిఫిక్​ పేరు ‘జకు మోంటియా నెంటాథోన్’. ఈ పూలలో డయాబెటిస్​, ఇన్​ఫ్లమేషన్, క్యాన్సర్​​ను తగ్గించే గుణాలున్నాయి. ఇవే కాదు, ఈ సీజన్​లో పూసే చామంతి, టేకీ, గులాబీ, సోంపు వంటి పూలన్నీ బతుకమ్మ తయారీలో వాడుకోవచ్చు.

Plants used for Ganapathi puja; Medicinal plants and Poisonous plants  around us: పూజ కు ఉపయోగించే కొన్ని పవిత్ర పుష్పాలు వాటి విశిష్టత

బీరపువ్వు
బీరపువ్వు పపుసు పచ్చగా ఉంటుంది. బతుకమ్మకు చక్కటి అందాన్నిస్తుంది. బీరపువ్వు  సీజనల్ ఫ్లవర్. దీని సైంటిఫిక్​ పేరు ‘లుఫా’. బీరకాయలను ఎండబెట్టి అందులో ఏర్పడే పీచును రంగుల్లో వాడతారు. బతుకమ్మను పేర్చేటప్పుడు నుదుటన తిలకం దిద్దినట్లుగా బీరపువ్వును పెడతారు. వీటిలో బంతి, చామంతి వర్షాకాలం దోమల నివారణకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నందివర్ధనం ప్రత్యేక గుణాలు కల పుష్పం. దీనివల్ల కండ్లకు మేలు జరుగుతుంది. అంతేకాదు ఇది పలు ఆయుర్వేద ఔషధాల్లో, చిట్కావైద్యంలో ఉపయోగిస్తారు.

17 Stunning Plants That Bloom all Summer Long - Remodeling Expense

బొగడబంతి పూలు..
బొగడబంతి పూలు..చూడటానికి చాలా చాలా అందంగా ఉంటాయి.ఈ పూల చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి..!! ఈ మొక్కను గ్లోబ్ ఉసిరి, వడ మల్లి, గుండి బంతి అని పిలుస్తారు. ఈ మొక్కలో బీటాసైనిన్ ఉంటుంది. లుకేమియా క్యాన్సర్ కణాలు మాయాజాలం ద్వారా బీటాసైనిన్‌లను అడ్డుకుంటాయి. బోగడ బంతి మొక్క నుంచి బీటాసైనిన్‌లను సేకరించి క్యాన్సర్‌ మందుల్లో వాడుతున్నారని పలువురు ఆరోగ్య పరిశోధకులు చెబుతున్నారు. ఈ మొక్క యొక్క ఆకులు మరియు విత్తనాలు మూత్ర మరియు ప్రోస్టేట్ క్యాన్సర్‌లో సహాయపడతాయి. ఈ మొక్కలలో ఉండే ఫ్రీ రాడికల్స్ మన చర్మాన్ని అతినీలలోహిత కిరణాల నుండి రక్షిస్తాయి. ఇది కాకుండా, ఈ మొక్కలు యాంటీ మైక్రోబియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు, వైరస్‌లను నివారిస్తాయి.

 

15 Special Flowers Of Bathukamma & Their Significance In Detail - Chai  Bisket

సీత జడ పూలు..
సీత జడ పూలనే సీతమ్మవారి జడగంటలు అని అంటారు. ఈ పూలను నారలు, రంగుల తయారీలో వాడతారు. సిలోసియా అరిగేటియా అమరాంథస్ దీని సైంటిఫిక్​ పేరు.

చేమంతి పువ్వు | ప్రకృతి వరాలు పుష్పాలు | Sirimalle

అంతేకాదు బతుకమ్మలో అన్ని పూలు మమేకమైపోతాయి. బంతి, చామంతి,గులాబీ ఇలా అన్నిపూలుతమదైన శోభనిస్తాయి బతుకమ్మకు. బతుకమ్మ పేర్చే పూలన్నింటిని గమనిస్తే అవన్నీ తెలంగాణ పల్లెల్లో విరివిగా దొరికేవి. అంతేకాదు అవన్నీ అందరికీ అంటే సామాన్యుడి నుంచి ధనికుల వరకు ఎవ్వరికైనా సులభంగా, డబ్బులు ఖర్చు పెట్టకుండానే దొరుకుతాయి. అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండానే ప్రకృతిలో దొరికే అమూల్యమైన పూలే మన బతుకమ్మను పేర్చడానికి ఉపయోగిస్తారు.

ఒంగోలులో బంతి పూల తోట || REDDYNEWS - YouTube

వాటిని వర్ష, శీతాకాల సంధి సమయంలో ఉపయోగించడం వల్ల సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటమే కాకుండా, నిండుకుండల్లాగా ఉండే చెరువులు, కుంటలూ వీటితో శుభ్రం అవుతాయి. వీటన్నింటి వెనుక సైన్స్ ఉందంటే మనం నమ్మం కానీ ఏదో ఒకరోజు నాసా లాంటి వారు వచ్చి చెప్తారు. అప్పుడు నమ్ముతాం. ఏది ఏమైనా బతుకమ్మ నిజంగా మన బతుకులలో రంగురంగుల పూల పండుగే. రోటీన్ లైఫ్‌కు భిన్నంగా దూరమవుతున్న ఆప్యాయతలు, పలకరింపులను కాపాడే ఆత్మీయ పండుగ.