బతుకమ్మ చీరలు రెడీ..బంగారు, వెండి రంగులు, 225 వెరైటీలు

  • Published By: madhu ,Published On : August 20, 2020 / 09:55 AM IST
బతుకమ్మ చీరలు రెడీ..బంగారు, వెండి రంగులు, 225 వెరైటీలు

దసరా పండుగ అనగానే..గుర్తుకు వచ్చేది బతుకమ్మ. తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే..బతుకమ్మ పండుగ రానే వస్తోంది. ఈ పండుగ సందర్భంగా..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు అందించే ‘బతుకమ్మ చీరల’ పంపిణీకి ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తోంది.



ఈ సంవత్సరం 75 లక్షల చీరలను తయారు చేయిస్తోంది. చీరల ప్రాసెసింగ్, ప్యాకింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే జిల్లాలకు పంపించాల్సి అనుకున్నా…భారీ వర్షాల కారణంగా వీలు కావడం లేదు. చీరలను తయారు చేయించేందుకు వేరే వారికి అప్పగించకుండా..సిరిసిల్ల నేతన్నలకు పని అప్పసిరిసిల్లలో 20 వేల మరమగ్గాలపై 15 వేల మంది కార్మికులు రాత్రి, పగలు అనే తేడా లేకుండా పని చేస్తున్నారు.



చీరెల తయారీని మంత్రి కేటీఆర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బంగారు, వెండి రంగుల్లో జరీతో బతుకమ్మ చీరెను తయారు చేస్తున్నారు. 225 వెరైటీలున్నాయి. నాణ్యమైనవిగా, ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. 10 గజాల చీరెలు 10 లక్షలు ఉండగా.. మిగిలిన 90 లక్షల్లో 5.50 మీటర్ల చీరె, 85 సెంటీమీటర్ల జాకెట్‌ వస్ర్తాన్నిఆడబిడ్డలకు ఇవ్వనున్నారు.



సెప్టెంబర్‌ నెలాఖరుకల్లా అన్ని జిల్లాలకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు ఉండి, 19 ఏండ్ల వయస్సు పైబడిన ఆడపడుచులందరికీ పండుగ సందర్భంగా పంపిణీ చేస్తారు.