దసరా పండుగకు ముందే బతుకమ్మ చీరలు

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 07:49 AM IST
దసరా పండుగకు ముందే బతుకమ్మ చీరలు

దసరా పండుగ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు ఇచ్చే బతుకమ్మ చీరలు రెడీ అయిపోయాయి. పండుగకు కంటే ముందే వారం రోజుల ముందు పేదలకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ పంపిణీ కార్యక్రమం అక్టోబర్ రెండో వారంలోగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.



ప్రస్తుతం ఉన్న కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా పంపిణీ చేయాలని కలెక్టర్లకు ఆయన సూచించారు. 2020, ఆగస్టు 31వ తేదీ చేనేత, నేత కార్మికుల సంక్షేమంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
https://10tv.in/tirumala-srivari-salakatla-brahmotsvams-in-ekantam/
బతుకమ్మ చీరల ఉత్పత్తి దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. చేనేత వస్త్రాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందన, టెస్కో వస్త్రాలపై ప్రచారం నిర్వహించాలన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల టెస్కో షాపులను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగేలా చూస్తామన్నారు. కరోనా కాలంలో చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చి 25 వేల మంది నేతన్నలను ప్రభుత్వం ఆదుకుందన్నారు.



అలాగే..రాష్ట్రంలో జిన్నింగ్ మిల్లుల పరిశ్రమకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ, సహకారాలు అందిస్తుందన్నారు. ప్రస్తుత సీజన్ లో భారీగా పత్తి సాగైన నేపథ్యంలో పంట కొనే ఏర్పాట్లు చేసినందుకు జిన్నింగ్ మిల్లుల యజమానుల సంఘం నేతలు, యాజమాన్యాలతో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డిలు సమావేశమయ్యారు. జిన్నింగ్ మిల్లుల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపుతామని హమీనిచ్చారు.