Bathukamma Sarees : ప్రభుత్వం కానుక.. నేటి నుంచే తెలంగాణ బతుకమ్మ చీరల పంపిణీ..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం (అక్టోబర్ 2) నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది.

10TV Telugu News

Bathukamma Sarees : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం (అక్టోబర్ 2) నుంచి బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానుంది. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మహిళలకు చీరలను పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది కూడా 810 రకాల చీరలను 1.08 కోట్ల మంది మహిళలకు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. బతుకమ్మ చీరల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు ఖర్చు చేసింది. గ్రామ, వార్డు స్థాయి కేంద్రాలు, ఇండ్ల వద్దకు చీరలు చేరాయి. ఈ నెల 6వ తేదీ వరకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. ఈ చీరల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. చీరలన్నీ దాదాపు అన్ని జిల్లాలకు చేరాయి. జిల్లాల నుంచి గ్రామాల వారిగా అధికారులు మహిళలకు సరఫరా చేశారు.
AP : క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం ప్రారంభం

ఈ నెల 6వ తేదీ వ‌ర‌కు బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి బతుకమ్మ పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో అంతకుముందే చీరలు పంపిణీ చేసేలా అధికారులు గ్రామాల వారీగా ఏర్పాట్లు చేశారు. 18 ఏళ్లు దాటిన రేష‌న్ కార్డులో పేరు న‌మోదైన వారికి చీర‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. 810 ర‌కాల చీర‌ల‌ను, 1.08 కోట్ల మ‌హిళ‌ల‌కు పంపిణీ చేయ‌నున్నట్లు అధికారులు వెల్లడించారు. బ‌తుక‌మ్మ చీర‌ల కోసం ప్రభుత్వం రూ.333.14 కోట్లు ఖ‌ర్చు చేసింది. ఈ ఏడాది సరికొత్తగా ఏకంగా 290 రంగుల్లో బతుకమ్మ చీరలు తయారుచేశారు.

గత ఏడాదిలో చీరల పంపిణీ సందర్భంగా మహిళల నుంచి అభిప్రాయాలను మంత్రి కేటీఆర్‌ సేకరించారు. సీఎం ఆదేశాల మేరకు ఈ ఏడాది సరికొత్తగా 19 రంగులు, 17 డిజైన్లతో మొత్తం 290 రంగుల్లో సరికొత్తగా రూపొందించారు. డాబీ అంచు చీరలు బతుకమ్మ పండుగకు ప్రత్యేకతను తీసుకురానుంది. చీరల ప్యాకింగు కూడా ఎంతో ఆకర్షణీయంగా అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చీరల పంపిణీకి గ్రామాలు, మున్సిపల్ వార్డులు, కార్పొరేషన్ డివిజన్ల వారీగా రేషన్‌ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
BiggBoss : బిగ్ బాస్ లో కొత్త లవ్ స్టోరీ.. ముద్దులతో గుడ్ నైట్..

×