R. Krishnaiah : గవర్నర్ గవర్నర్ గానే ఉండాలి.. రాజకీయ నాయకురాలుగా ఉండకూడదు: కృష్ణయ్య

రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప.. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.

R. Krishnaiah : గవర్నర్ గవర్నర్ గానే ఉండాలి.. రాజకీయ నాయకురాలుగా ఉండకూడదు: కృష్ణయ్య

R Krishnaiah

R. Krishnaiah criticizes Governor : గవర్నర్ గవర్నర్ గానే ఉండాలి, రాజకీయ నాయకురాలు గా ఉండకూడదు అని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఆమె బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ బీసీలను కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వదన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు ఇష్టం లేకున్నా అందరిని కలవాలని చెప్పారు. కొందరిని మాత్రమే కలుస్తామనడం మంచిది కాదన్నారు.

పార్టీ వాళ్ళు చెప్తేనే కలుస్తా అనేది కరెక్ట్ కాదని చెప్పారు. సమస్యపై ఆమె స్పందించాలి తప్ప.. రాజకీయ కోణంలో పోయి పార్టీలను ఇబ్బంది పెట్టడానికి తాము వ్యతిరేకమని తెలిపారు. రాజ్యాంగ బద్దంగా ఉన్న హక్కులను ఆమె వాడుకోవాలి తప్ప.. ఇతర పార్టీల నేతలను ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదన్నారు.

R Krishnaiah : పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి : ఆర్ కృష్ణయ్య

బీసీ సమస్యలపై అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కూడా బీసీ బిల్లు కోసం మద్దతు ఇచ్చారని తెలిపారు. బీసీ జనగణన కోసం టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ప్రొటెస్టు చేశారని వెల్లడించారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు.