R Krishnayya: నా ఫోన్ నంబర్ ఫేస్‌బుక్‌లో పెట్టారు.. ఫోన్లు చేస్తూనే ఉన్నారు

తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య.

R Krishnayya: నా ఫోన్ నంబర్ ఫేస్‌బుక్‌లో పెట్టారు.. ఫోన్లు చేస్తూనే ఉన్నారు

R Krishnaiah

R Krishnayya: తన ఫోన్ నెంబర్‌ను ఫేస్‌బుక్‌లో పెట్టి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య. బహిరంగంగా ఫోన్ నెంబర్లు పెట్టడంతో ఆగంతకులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, రెండు రోజులుగా వెయ్యికి పైగా ఫోన్‌లు చేశారని చెప్పుకొచ్చారు ఆర్ కృష్ణయ్య. హుజురాబాద్‌లో గెల్లు శ్రీనివాస్‌కు మద్దతు ఇచ్చారని, ఈటల ఓటమిని కోరినందుకు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పుకొచ్చారు ఆర్ కృష్ణయ్య.

రెండు రోజుల నుంచి నాకు వెయ్యికి పైగా ఫోన్లు వస్తున్నాయని, దీని వెనుక ఎవరున్నారో కనుక్కోవాలని డిజీపీ, హోంమంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు ఆర్ కృష్ణయ్య. బీసీ బంధు కోసం నేను ఎన్నో ధర్నాలు చేశానని, కొన్ని శక్తులు మాత్రం నాపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. నలభై ఏళ్లుగా బీసీల కోసం పోరాటం చేశానని, హాస్టల్స్, స్కూల్స్ కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తినని చెప్పుకొచ్చారు.

పేద కులాల అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడి మీద దుష్ప్రచారం చెయ్యడం సరికాదన్నారు ఆర్ కృష్ణయ్య. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం.. అభినందించడం వల్లే నన్ను బెదిరిస్తున్నారని అన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారని అన్నారు.