Study Circles : నిరుద్యోగులకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇక ఫ్రీగా కోచింగ్.. నియోజకవర్గానికి ఒకటి

తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అదిరిపోయే వార్త చెప్పింది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119..

Study Circles : నిరుద్యోగులకు ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇక ఫ్రీగా కోచింగ్.. నియోజకవర్గానికి ఒకటి

Study Circles

Study Circles : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోలకు అదిరిపోయే వార్త చెప్పింది. నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2021 జూన్ 2 న వాటిని ప్రారంభించేందుకు కసరత్తు మొదలైందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. త్వరలో తెలంగాణలో రాబోయే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లకు అప్లయ్ చేసుకున్న వారికి ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.

”రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ను ఏర్పాటు చేయనున్నాం. ఈ మేరకు బీసీ విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 బీసీ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం” అని మంత్రి చెప్పారు.

లక్షకుపైగా ఉద్యోగార్థులకు సకల సౌకర్యాలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2న బీసీ స్టడీ సెంటర్లను ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ వేదికగా వేదికగా లక్షలాది విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తామన్నారు. నిష్ణాతులైన వారితో బోధించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబాపూలే ఆశయాలను సీఎం కేసీఆర్‌ సాకారం చేశారని చెప్పారు. డిజిటల్‌ స్టూడియోలో రూపొందించిన పాఠాలను యూట్యూబ్‌ ద్వారా ప్రసారం చేస్తామన్నారు. బీసీ స్టడీ సెంటర్లలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు కూడా అందిస్తామన్నారు.

స్టడీ సెంటర్లలో అత్యాధునిక కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిద్దిపేట, గద్వాలలో నూతన స్టడీ సర్కిళ్లను ప్రారంభించామన్నారు. సిరిసిల్లలో త్వరలో స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇలాగే ప్రతీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. త్వరలో తెలంగాణలో రాబోయే అన్ని నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు.

మహాత్మా జ్యోతిపూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు మంత్రి గంగుల. ఆ తర్వాత స్మార్ట్‌ పాఠాల కోసం బీసీ స్టడీ సర్కిల్‌ డిజిటల్‌ స్టూడియోను ప్రారంభించారు.