Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..

ఎండలు మండిపోతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పలు రకాల డ్రింక్ లను సేవిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా పలు రకాల పండ్ల జ్యూస్ లు ...

Hyderabad News: బీర్లు తెగ తాగేస్తున్నారు.. గ్రేటర్ పరిధిలో రికార్డు స్థాయిలో విక్రయాలు..

Liquor Shops

Hyderabad News: ఎండలు మండిపోతున్నాయి.. పగటి ఉష్ణోగ్రతలు 45డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో వేసవి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు పలు రకాల డ్రింక్ లను సేవిస్తున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎక్కువగా పలు రకాల పండ్ల జ్యూస్ లు, కొబ్బరి బోండాలు వంటి వాటిని సేవిస్తూ వేసవి తాపం నుంచి కొంత ఉపశమనం పొందుతున్నారు. మందుబాబులు మాత్రం వేసవి తాపాన్ని తీర్చుకొనేందుకు బీర్లను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే మందుబాబులకు వేసవి నుంచి ఉపశమనం కలిగించే పానియం బీర్లే అన్నఅంశాన్ని ఒప్పుకోక తప్పదు.

Glass Of Wine : రాత్రి ఒక గ్లాసు వైన్… టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్నితగ్గిస్తుందా?…

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనవరి నుంచి మే 15 వరకు జరిగిన మద్యం విక్రయాల్లో బీర్లదే హవా సాగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి మే 15 వరకు రంగారెడ్డి జిల్లాలో 4,68,56,640, హైదరాబాద్‌లో 1,74,20,700, మేడ్చల్‌ జిల్లాలో 97,16,424 బీర్లు విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది(2021 సంవత్సరం) తొలి ఐదు నెలల్లో హైదరాబాద్ జిల్లా పరిధిలో బీర్ల విక్రయాల ద్వారా రూ. 150కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు రాగా, ఈ ఏడాది ఇప్పటికే రూ. 262కోట్ల మేర విక్రయాలు జరిగాయి.

Wine Shop Names: మద్యం దుకాణాలకు దేవుళ్ళు, జాతీయ నాయకుల పేర్లు పెట్టరాదు: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

రంగారెడ్డి జిల్లాలో గతేడాది 483 కోట్లు రాగా, ఈ ఏడాది ఇప్పటికే 703 కోట్ల ఆదాయం సమకూరింది. మేడ్చల్ జిల్లాలో గతేడాది రూ. 59 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.146 కోట్ల ఆదాయం ఒక్క బీర్ల విక్రయాల ద్వారానే ఎక్సైజ్ శాఖకు చేరాయి. ఈ లెక్కలు చూస్తుంటే.. వేసవి కాలంలో ఎండల తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు మందుబాబులు బీర్లనే ఎంచుకున్నట్లు అర్థమవుతుంది.