Best Chef season-2: హైదరాబాద్‌లో ప్రారంభమైన బెస్ట్ చెఫ్‌ సీజన్‌-2 పోటీలు

ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హోమ్‌ చెఫ్స్‌ తమ అంతర్గత ప్రతిభను చాటే అవకాశం దీని ద్వారా కల్పించడంతో పాటుగా తమ కమ్యూనిటీతో మరింతగా బంధం ఏర్పరుచుకునే అవకాశమూ అందిస్తున్నాము

Best Chef season-2: హైదరాబాద్‌లో ప్రారంభమైన బెస్ట్ చెఫ్‌ సీజన్‌-2 పోటీలు

Best Chef program

Best Chef season-2: మరోమారు హైదరాబాద్‌ మహిళలకు తమ పాకశాస్త్ర ప్రావీణ్యం చూపించుకునే అవకాశం వచ్చింది. మరీ ముఖ్యంగా హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలలో నివాసముంటున్న మహిళలకు ఇది లభించింది. గత సంవత్సరం అపూర్వ విజయం సాధించిన ఇంటర్‌ హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీ లైవ్‌ కుకింగ్‌ పోటీలు మరో మారు నగరంలో జరుగుతున్నాయి. నగరంలో దాదాపు 30కి పైగా హై రైజ్‌ గేటెడ్‌ కమ్యూనిటీలలో ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతి గేటెడ్‌ కమ్యూనిటీ నుంచి ఒక విజేతను ఎన్నుకుని వారితో ఫైనల్స్‌ను నిర్వహించి ‘బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ సీజన్‌ 2’ విజేతగా ఒకరిని ఎంపిక చేయనున్నారు.

Hot Summer : ఏపీలో మండుతున్న ఎండలు, ఆ జిల్లాలో అత్యధికంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రత్నదీప్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ‘‘ఈ కార్యక్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. హోమ్‌ చెఫ్స్‌ తమ అంతర్గత ప్రతిభను చాటే అవకాశం దీని ద్వారా కల్పించడంతో పాటుగా తమ కమ్యూనిటీతో మరింతగా బంధం ఏర్పరుచుకునే అవకాశమూ అందిస్తున్నాము’’ అని అన్నారు. కుకింగ్‌ ప్రేమికులకు ఓ వేదికగా బెస్ట్‌ చెఫ్‌ హైదరాబాద్‌ సీజన్‌ 2 నిలువనుందని ఫ్రీడమ్‌ హెల్తీ ఆయిల్స్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి చంద్రశేఖర రెడ్డి అన్నారు.

Maruti Suzuki : మారుతి సుజుకి నుంచి ఫ్రాంక్స్- బాలెనో కార్లు.. ఫీచర్లు అదుర్స్.. ఇందులో ఏ కారు బెటర్ అంటే?
హైదరాబాద్‌లోని అన్ని గేటెడ్‌ కమ్యూనిటీలలో నూతన కలినరీ ప్రేమికులను సృష్టించనున్నామని స్వస్తిక్‌ స్పైసెస్‌ ప్రతినిధులు అన్నారు. ఈ పోటీలు మసాలెదార్‌ విజయం సాధించాలని వారు అభిలాషించారు. దేశీ న్యూట్రి బిజినెస్‌ హెడ్‌ గోవర్దన్‌ రెడ్డి మాట్లాడుతూ తమ బ్రాండ్‌ మిల్లెట్‌, మిల్లెట్‌ ఆధారిత ఆహారాన్ని అందిస్తుందని, మా వినియోగదారులను నేరుగా చేరుకునే అవకాశం ఈ పోటీ తమకు అందిస్తుందన్నారు. ఎస్‌ఐపీఎల్‌ ఈవెంట్స్‌ ఫౌండర్‌ ప్రవీణ్‌ కె అగర్వాల్‌ మాట్లాడుతూ సీజన్‌1 కు అపూర్వ స్పందన లభించిందని, ఆ స్ఫూర్తితోనే సీజన్‌ 2 ప్రారంభించామంటూ జాతీయ స్థాయి పోటీలుగా వీటిని నిర్వహించే ఆలోచనలో ఉన్నామన్నారు.