Telangana : ఎక్కడ రోడ్డుందో, నీళ్లున్నాయో తెలియడం లేదు..ప్రాణాలు పోతున్నాయి, జాగ్రత్త

నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు.

Telangana : ఎక్కడ రోడ్డుందో, నీళ్లున్నాయో తెలియడం లేదు..ప్రాణాలు పోతున్నాయి, జాగ్రత్త

Tg Rain

Heavy Rains Telangana : భారీ వర్షాలు, వరదలు ముంచేస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడ రోడ్డుందో…ఎక్కడ నీళ్లున్నాయో తెలియడం లేదు. వాగులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు తీస్తున్నాయి. తెలిసిన రూటే కదా.. అలవాటయిన ప్రయాణమే కదా.. అన్న ఆలోచనలో ప్రజలు ప్రమాదాన్ని పసిగట్టలేకపోతున్నారు.

Read More : Telangana: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

నీటి గతిని, ప్రవాహ ఉధృతిని అంచనావేయలేకపోతున్నారు. తొందరగా గమ్యస్థానానికి చేరాలన్న ఆతృతలో ప్రాణాలు కోల్పోతున్నారు. వికారాబాద్, యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌ జిల్లాల్లో జరిగిన ప్రమాదాలే తెలియచేస్తున్నాయి. రోడ్డు మీద కొంచెం నీళ్లు నిలిస్తేనే.. ప్రయాణం కష్టమవుతుంది. వాహనం ఏదైనా సరే… అత్యంత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. ఇక రోడ్డు మొత్తం నీటిలో మునిగిపోయి ఉంటే…ప్రవాహం అంతకంతకూ పెరుగుతుంటే…ఆ దారిలో ప్రయాణించకపోవడమే మంచిది.

Read More : Rain Alert : తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్, భారీ నుంచి అతి భారీ వర్షాలు

ప్రయాణం వాయిదా వేసుకోవడమో, తాత్కాలికంగా నిలిపివేసుకోవడమో మంచిది. కానీ నీటి తీవ్రత ఎక్కువగా ఉందని అర్ధం చేసుకోలేకపోవడమో, ఆలస్యమవుతోందన్న ఆలోచనో.. ప్రజలు మోకాలి లోతు నీరు నిలిచిపోయి ఉన్నా ప్రయాణాలు ఆపడంలేదు. ఫలితంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నారు.

Read More : Weather Forecast For Andhra Pradesh : ఏపీలో రాగల 3 రోజులు భారీ వర్షాలు

ఈ ఏడాది ఇప్పటికే భారీ వర్షాలు కురియడంతో…ఇప్పడు చిన్నపాటి వానకే తెలుగు రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, చెరువులూ ఏకమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు  సూచిస్తున్నారు. నదులు, వాగులు, చెరువులున్న ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు ప్రవాహ ఉధృతి తగ్గేదాకా వేచి చూడాలని కోరుతున్నారు. రాత్రి వేళల్లో వీలయినంతవరకు ప్రయాణాలు మానుకోవాలని చెబుతున్నారు.