Bhadradri : నేటి నుండి భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు.. భద్రాచలంకు 350 ప్రత్యేక బస్సులు

కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఎదుర్కోలు జరుగనుంది. 10న నవమి సందర్భంగా కళ్యాణం నిర్వహించనున్నారు. 11న పట్టాభిషేకం ప్రధాన వేడుకలు జరుగనున్నాయి.

Bhadradri : నేటి నుండి భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు.. భద్రాచలంకు 350 ప్రత్యేక బస్సులు

Bhadradri

Bhadradri Brahmotsavalu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి నుండి భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. నేటి నుండి ఈ నెల 16 వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. కొవిడ్ ఆంక్షలతో గత రెండేళ్ళుగా దేవాదాయశాఖ క్రతువును నిరాడంబరంగా నిర్వహించింది. ఈ సారి కోవిడ్ ఆంక్షలు లేకపోవడంతో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది.

భక్తుల కోసం 3లక్షల లడ్డులు తయారు చేశారు. 175 క్వింటాళ్ల తలంబ్రాలు సిద్ధం చేశారు. 60 కౌంటర్ల ద్వారా ఉచితంగా సిబ్బంది భక్తులకు అందించనున్నారు. 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్ టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా పంపిణీ చేశారు.

Bhadradri : రాములోరి పెళ్లి.. కల్యాణానికి భారీగా ఏర్పాట్లు

కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 9న ఎదుర్కోలు జరుగనుంది. 10న నవమి సందర్భంగా కళ్యాణం నిర్వహించనున్నారు. 11న పట్టాభిషేకం ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. నవమికి భద్రాచలంకు 350ప్రత్యేక బస్సులు నడపనున్నారు.