Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే అంశంలో ఇంకా స్పష్టత లేదు.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

Bhadradri: భద్రాద్రిలో శ్రీరాముల వారి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 30, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా రాములోరి కల్యాణం నిర్వహిస్తారు. కల్యాణం వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Karnataka Assembly Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మోగిన నగారా.. మే 10న పోలింగ్, 13న ఫలితాలు

అయితే, ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారా.. లేదా అనే అంశంలో ఇంకా స్పష్టత లేదు. గతంలో ఉన్న సంప్రదాయానికి భిన్నంగా రామయ్య పెళ్లికి ఏడేళ్ల నుంచి సీఎం కేసీఆర్ హాజరు కావడం లేదు. చివరగా 2016లో శ్రీరామ నవమి వేడుకలకు కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. అయితే, తెలంగాణ గవర్నర్ తమిళిసై భద్రాద్రి రాక ఖరారైంది. ఈ నెల 31న జరిగే పుష్కర పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ హాజరవుతారు. మరోవైపు భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం తగ్గిపోయింది. శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు లక్షల మంది తరలివస్తుంటారు. వీరిలో చాలా మంది గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు.

అయితే, ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నందున భక్తులకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. ఎగువ నుంచి నీటిని వదిలే అవకాశం ఉన్నా… అధికారులు ఈ దిశగా ఆలోచించడం లేదు. ఇంకోవైపు భద్రాచలంలో ఉన్న మురుగునీరు లీకేజ్ రూపంలో గోదావరిలోకి వచ్చి చేరుతోంది. దీంతో నీళ్లు కలుషితంగా కనిపిస్తున్నాయి.