ఆదివాసుల కష్టాలు..కిన్నెరసాని వాగులో మునిగిన ఎడ్లబండి..10tv కథనానికి స్పందన

  • Published By: madhu ,Published On : August 7, 2020 / 02:24 PM IST
ఆదివాసుల కష్టాలు..కిన్నెరసాని వాగులో మునిగిన ఎడ్లబండి..10tv కథనానికి స్పందన

ఓ ఎడ్లబండి..అందులో మనుషులు..వాగు దాటుతున్నారు. వాగు పొంగిపొర్లుతోంది. మొత్తం ఎడ్లబండి మునిగిపోయింది. అందులో ఉన్న వారు..నీటిలో కొద్ది వరకు మునిగిపోతున్నారు. ఓ వ్యక్తి తాడు సహాయంతో..ఎడ్లను ముందుకు పోనిస్తున్నాడు.



ఈ వీడియో చూస్తున్న వారు..ఏమై పోతారన్న ఉత్కంఠ నెలకొంది. కానీ వారికి మాత్రం షరామాములే. వర్షాకాలం వచ్చినప్పుడల్లా ఇలాంటి కష్టాలు కామన్ అయిపోతున్నాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.

ఇప్పటికీ అక్కడి ఆదివాసీలు అష్టకష్టాలు పడుతున్నారు. వానాకాలం వచ్చిందంటే చాలు..పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతున్నాయి. ఆలపల్లి మండలం, మైలారం, రాయగూడెం, ఇలా 15 గ్రామాలు రాకపోకలు సాగించాలంటే..కిన్నెరసాని వాగును దాటాలి. వర్షాకాలం..వాగు పొంగిపొర్లుతుంటుంది. ఎడ్లబండులపై ప్రయాణిస్తూ.., ఈదుకుంటూ వాగులో నుంచి వెళుతుంటారు.



2020, ఆగస్టు 07వ తేదీ గురువారం కొంతమంది ఎడ్లబండిపై ప్రయాణిస్తున్నారు. ఎడ్లబండి పూర్తిగా మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏదైనా జరగరానిది జరిగితే..పెద్ద ప్రమాదమని, వరదలో కొట్టుకపోతామని తెలిసినా..అలాగే ప్రయాణిస్తున్నారు. వంతెన నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నా..ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆదివాసీలు వెల్లడిస్తున్నారు.





ప్రమాదకరస్థితిలో ప్రయాణిస్తున్న విషయాన్ని 10tv వరుస కథనాలను ప్రసారం చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి స్పందించారు. ఆళ్లపల్లి, గుండాల మండలాల ప్రజలు ప్రవహిస్తున్న వాగును దాట వద్దని, ఉదృతి తగ్గగానే..ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన హామినిచ్చారు. పొంగిపొర్లుతున్న వాగు వద్ద ప్రమాదహెచ్చరికలను ఏర్పాటు చేయాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.