Hussain Sagar : గణేష్ నిమజ్జనం ఎక్కడ ? అంతా గందరగోళం

మట్టి విగ్రహాలు తప్ప.. రసాయానాలతో తయారు  చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలపై గందరగోళం నెలకొంది.

Hussain Sagar : గణేష్ నిమజ్జనం ఎక్కడ ? అంతా గందరగోళం

Bhagyanagar Ganesh Utsav Samithi On Hc Orders

Bhagyanagar Ganesh : హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మట్టి విగ్రహాలు తప్ప.. రసాయానాలతో తయారు  చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనాలపై గందరగోళం నెలకొంది. మరోవైపు 2021, సెప్టెంబర్ 12వ తేదీ ఆదివారం నుంచే గణేశ్ నిమజ్జనాలు మొదలుకానున్నాయి. దీంతో భక్తులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయాలా? వద్దా? అన్న సందిగ్ధంతో ఉన్నారు.

Read More : Weather Update: అలెర్ట్.. నేడు, రేపు భారీ వర్షాలు!

హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే అనుమతి ఉన్న విగ్రహాల నిమజ్జనాల కోసం మాత్రం జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది. నిమజ్జన శోభయాత్ర జరిగే మార్గంలో రోడ్ల మరమ్మత్తులు, విద్యుత్ దీపాల ఏర్పాటు, చెత్త తొలగింపు వాహనాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం బల్దియా 168 టీమ్‌లను ఏర్పాటు చేసింది. 10 వేల మంది శానిటేషన్ కార్మికులతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగేందుకు భారీ క్రేన్లను సైతం అందుబాటులోకి తీసుకొస్తుంది. కానీ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు బల్దియా అధికారులు. నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ.. ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు సిద్దంగా ఉన్నామంటున్నారు.

Read More : Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జనాలపై అటు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కూడా స్పందించింది. దేవుణ్ణి పూజించడం.. నిమజ్జనం చేయడం ప్రజల హక్కు అన్నారు. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని.. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి వినాయక నిమజ్జనం సాఫీగా సాగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక, గణేష్ విగ్రహాలతో నీరు పొల్యూట్‌ అవుతుంది అనేది ఏ రిపోర్టులో లేదన్నారు ఉత్సవ సమితి సభ్యులు. కలుషిత నీటితోనే హుస్సేన్ సాగర్‌లో నీరు కలుషితం అవుతుందన్నారు.