Peoples March: ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. అధికారంలో మద్యం, అప్పులు, భూముల అమ్మకాలు.. కేసీఆర్ ప్రభుత్వంపై భట్టి ఫైర్

భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం

Peoples March: ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. అధికారంలో మద్యం, అప్పులు, భూముల అమ్మకాలు.. కేసీఆర్ ప్రభుత్వంపై భట్టి ఫైర్

Bhatti Vikramarka

Peoples March: నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన భారత్ రాష్ట్ర సమితి పార్టీ.. వాటిని ఏనాడు పట్టించుకోలేదని, తీరా అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు, అప్పులు తేవడం, ప్రభుత్వ భూములు అమ్మడం వంటి వాటికే పరిమితమైందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పీపుల్స్ మార్చ్ చేస్తున్న భట్టి.. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జమ్మికుంట మండలం నాగంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Twitter Blue Verified Badge : లెగసీ బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్‌లను తొలగించిన ట్విట్టర్.. ఎవరినీ వదల్లేదు.. ఎలన్ మస్క్ అన్నట్టే చేశాడుగా..!

‘‘తెలంగాణ రాష్ట్ర మోడల్ అంటే మద్యం అమ్మకాలు, అప్పులు తేవడం, ప్రభుత్వ భూములు అమ్మడమే అయిపోయింది. నీళ్ళు, నిధులు, నియామకాల సెంటిమెంట్‭తో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వాటిని విస్మరించింది. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా వర్షాలకు పంట నష్ట పోతే ఎలాంటి నష్ట పరిహారం లేదు. 2013కు ముందు రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లిన వెంటనే ప్రభుత్వం చెల్లించేది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఒకే దఫాలో రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తాం. ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5లక్షలు ఇస్తాం. ఇల్లు కట్టుకునేందుకు జాగ లేని వాళ్ళకు నివేశన స్థలాలు కేటాయిస్తాం. అదేవిధంగా మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేస్తాం’’ అని హామీలు ఇచ్చారు.

AP CM Jagan : ఆదాయాలను ఆర్జించే శాఖల్లో మెరుగైన విధానాలు ఉండాలి : సీఎం జగన్

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం. గ్యాస్ సిలెండర్ రూ.500 ఆందజెస్తాం. ఇసుక మాఫియాను కట్టడి చేస్తాం. సహజ వనరులు రాష్ట్ర సంపదకే ఉండేలా చూస్తాం. రాష్ట్రంలో ఉన్న ఉద్యోగస్తులు అందరికి మొదటి వారంలో జీతాలు ఇస్తాం. పల్లె నుండి పట్టణం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ నిత్యం వార్తల్లో ఉండటం కోసం ఒకర్ని ఒకరు తిట్టుకున్నట్లు నటిస్తారు’’ అని విమర్శలు గుప్పించారు.