Crypto Cheating : కొంపముంచిన లాభాల ఆశ.. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.70 లక్షలు కొట్టేశారు

సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.

Crypto Cheating : కొంపముంచిన లాభాల ఆశ.. క్రిప్టో ట్రేడింగ్ పేరుతో రూ.70 లక్షలు కొట్టేశారు

Crypto Cheating

Crypto Cheating : సైబర్ మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. సైబర్ క్రిమినల్స్ కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ప్రకటనలతో ఆశ చూపి అడ్డంగా దగా చేస్తున్నారు. ప్రాఫిట్ పేరుతో ఖాతాలు ఖాళీ చేస్తున్నారు.(Crypto Cheating)

తాజాగా హైదరాబాద్ లో ఆ తరహా మోసాలు జరిగాయి. క్రిప్టో ట్రేడింగ్ లో అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ చీటర్స్.. ఏకంగా రూ.70 లక్షలు కాజేశారు. తాను మోసపోయామని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Massage Parlour : స్పా ముసుగులో వ్యభిచారం… బెంజి కారులో వచ్చి పోలీసులకు దొరికి పోయిన విటుడు

ఇదే తరహా మోసం మరొకటి చోటు చేసుకుంది. ఇన్వెస్ట్ మెంట్ పేరుతో రూ.28 లక్షలు కాజేశారు. బిజినెస్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశ చూపిన సైబర్ చీటర్స్.. ఏకంగా రూ.28 లక్షలు కాజేశారు. లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమన్నారు. అంబర్ పేట్ కి చెందిన ముగ్గురు యువకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

డిజిటల్‌ లావాదేవీలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త మోసాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు హ్యాకింగ్ ద్వారా మన ఖాతాల్లోకి చొరబడ్డ దుండగులు.. ఇప్పుడు ఏకంగా మనద్వారా మనల్ని మోసం చేయిస్తున్నారు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీపై ప్రజలకు పెరుగుతున్న మోజును సొమ్ము చేసుకుంటున్నారు.

Theft Case : దారుణం-దొంగతనం నెపంతో మహిళలను నగ్నంగా ఉంచి వాతలు పెట్టిన ప్రబుధ్దుడు

క్రిప్టో కరెన్సీపై ఇప్పటివరకు నియంత్రణ లేదు. మరోవైపు దీని కింద జరుగుతున్న లావాదేవీలను పర్యవేక్షించేందుకు ఎటువంటి సంస్థ అందుబాటులో లేదు. ఫలితంగా దీనివల్ల మోసపోతున్న వారికి అందే సాయం కూడా తక్కువే అని చెప్పాలి. క్రిప్టో కరెన్సీ వ్యవహారాలు చాలా గోప్యంగా జరుగుతుంటాయి. కాబట్టి మోసగాళ్లను గుర్తించడం కూడా చాలా కష్టం. ఒకవేళ క్రిప్టోలో మదుపు చేయాలనుకున్నా.. ఇప్పటికే చేస్తున్నా.. ఈ తరహా మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి.

Minor Girls Gang Raped : పోర్న్ వీడియోలు చూసి ఘోరం.. ఇద్దరు చిన్నారులపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అనే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. మీ చుట్టూ మోసగాళ్లు ఉంటారనే విషయాన్ని గ్రహించాలని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. మిమ్మల్ని చీట్ చేసేందుకు సైబర్ క్రిమినల్స్ పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తారని, వారి ఉచ్చుకి చిక్కొద్దని సూచించారు. అత్యాశపడ్డారో ఇక అంతే సంగతులు అంటున్నారు. మీ బ్యాంకు ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు.

Father Rapes Daughter : కూతురిపై తండ్రి అత్యాచారం.. 20ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు