Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్‌ ఫ్రాడ్‌.. మహిళ ఖాతాలోంచి రూ.24 లక్షలు కొట్టేశారు

వస్తువు కొనాలంటూ ఆమెతో కంత్రీగాళ్లు చాట్ చేసి.. కాల్ చేశారు. ఓ క్యూ ఆర్‌ కోడ్‌ను పంపారు.. దాన్ని స్కాన్‌ చేయాలని సూచించడంతో.. ఆమె దాన్ని స్కాన్‌ చేసింది.

Cyber Fraud : హైదరాబాద్‌లో భారీ సైబర్‌ ఫ్రాడ్‌.. మహిళ ఖాతాలోంచి రూ.24 లక్షలు కొట్టేశారు

Cyber Fraud

cyber fraud : టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. మాయమాటలు చెప్పి అమాయకుల బ్యాంక్‌ ఖాతాలను కేటుగాళ్లు ఖాళీ చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ OLXలో ఓ వస్తువు అమ్మకానికి పెట్టింది. దీంతో మహిళ ఖాతాలోంచి కంత్రీగాళ్లు ఏకంగా రూ. 24 లక్షలు దోచుకున్నారు. వస్తువును అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్న ఆ మహిళ.. ఇప్పుడు ఉన్న డబ్బును పోగొట్టుకొని లబోదిబోమంటూ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

వస్తువు కొనాలంటూ ఆమెతో కంత్రీగాళ్లు చాట్ చేసి.. కాల్ చేశారు. ఓ క్యూ ఆర్‌ కోడ్‌ను పంపారు.. దాన్ని స్కాన్‌ చేయాలని సూచించడంతో.. ఆమె దాన్ని స్కాన్‌ చేసింది. వెంటనే బ్యాంక్‌ ఎకౌంట్ నుంచి 2 లక్షలు ఖాళీ అయ్యాయి. వెంటనే అదే నెంబర్‌కు కాల్‌ చేసి విషయం చెప్పగా.. మళ్లీ స్కాన్‌ చేయండి డబ్బు తిరిగి వస్తుందని చెప్పారు. దీంతో ఆ మహిళ మళ్లీ స్కాన్‌ చేయడంతో ఖాతాలో ఉన్న 24 లక్షలు క్షణంలో మాయమయ్యాయి.

Share Market Fraud : లక్షకు రూ.15 లక్షలు వడ్డీ..! విజయవాడలో షేర్ మార్కెట్ పేరుతో భారీ మోసం

క్యూ ఆర్‌ కోడ్ స్కాన్‌ చేయొద్దంటూ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. కొందరు తెలిసీ తెలియక డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఓటీపీ, క్యూఆర్‌ కోడ్‌లను ఎవరు పంపినా రెస్పాండ్‌ కావొద్దని స్పష్టం చేస్తున్నారు. ఇటీవలే ఆ మహిళ భర్త మరణించడంతో.. తన సేవింగ్స్‌ బ్యాంకులో దాచుకున్నట్లు చెప్తోంది. క్యూఆర్ కోడ్, ఓటీపీ చెప్పాలని ఎవరు అడిగినా.. అది ఫ్రాడ్ కాల్‌గా తెలుసుకోవాలని సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.