Scholarships Scam : ఘరానా మోసం.. స్కాల‌ర్‌షిప్స్ పేరుతో కోటి రూపాయలు వసూలు

కాదేది మోసానికి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశ చూపి మభ్య పెట్టి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్

Scholarships Scam : ఘరానా మోసం.. స్కాల‌ర్‌షిప్స్ పేరుతో కోటి రూపాయలు వసూలు

Scholarships Scam

Scholarships Scam : కాదేది మోసానికి అనర్హం అన్నట్టు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఆశ చూపి మభ్య పెట్టి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. హైలైట్ ఏంటంటే.. కేటుగాళ్లు.. పైసా కూడా పెట్టుబడి పెట్టరు. కానీ, కోట్లు ఆర్జిస్తారు. తాజాగా హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ ఒకటి వెలుగుచూసింది. స్కాలర్ షిప్స్ పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డారు. ఏకంగా కోటి రూపాయలు వసూలు చేసి ఉడాయించారు.

Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

స్కాల‌ర్‌షిప్స్ పేరిట గ్రీన్ లీఫ్ ఫౌండేష‌న్ ప‌లువురు విద్యార్థుల‌ను మోసం చేసింది. గ్రీన్ లీఫ్ ఫౌండేష‌న్ ఒక్కో విద్యార్థి నుంచి రూ. 4 వేలు వ‌సూలు చేసింది. కానీ నెల‌లు గ‌డుస్తున్న‌ా స్కాల‌ర్‌షిప్స్ రాక‌పోవ‌డంతో స‌ద‌రు సంస్థ‌ను విద్యార్థులు నిల‌దీశారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

ఆ సంస్థ ప్ర‌తినిధుల నుంచి ఎలాంటి స్పంద‌న రాక‌పోవ‌డంతో, మోస‌పోయామ‌ని గ్ర‌హించిన బాధిత విద్యార్థులు.. రాజేంద్ర న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అత్తాపూర్‌లోని గ్రీన్ లీఫ్ ఫౌండేష‌న్ కార్యాల‌యంలో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హించారు. పోలీసుల సోదాల్లో 1,500 ద‌ర‌ఖాస్తులు ల‌భ్య‌మ‌య్యాయి. రూ. కోటి వ‌ర‌కు మోసం చేసి ఉండొచ్చ‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.

కొందరు కేటుగాళ్లు ఓ గ్రూప్ గా ఏర్పడ్డారు. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ అనే సంస్థ నెలకొల్పారు. స్కాలర్ షిప్స్ ఇస్తామని విద్యార్థులను మభ్యపెట్టారు. ఓ అప్లికేషన్ లో విద్యార్దుల పూర్తి వివరాలు తీసుకున్న నిర్వాహకులు… సర్వీస్ చార్జీల పేరుతో ఒక్కొక్కరి నుంచి 3 వేల నుండి 4 వేల రూపాయలు వసూలు చేశారు. స్కాలర్ షిప్ వస్తుంది కదా, తమ ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది అనే ఆశతో విద్యార్థులు వారు అడిగినంత డబ్బు ఇచ్చుకున్నారు. స్కాలర్ షిప్ కోసం ఎదురుచూడసాగారు. అయితే, కాలం గడిచిపోతోంది కానీ, నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన లేదు. విద్యార్థులు చాలా కాలం ఓపిక పట్టారు. చివరికి వారి ఓపిక నశించింది. స్కాలర్‌షిప్స్ ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. నిర్వాహకులు పొంతన లేని సమాధానం ఇచ్చారు. దీంతో వారికి మ్యాటర్ అర్థమైంది. తాము మోసపోయామని గ్రహించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. పోలీసులు విచారణలో భారీ స్కామ్ వెలుగుచూసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. మోసపోయిన విద్యార్థులు లబోదిబోమంటున్నారు.