kothagudem : వనమా రాఘవ కేసులో బిగ్ ట్విస్ట్, రామకృష్ణ బలాదూర్‌‌గా తిరిగేవాడు

ఆత్మహత్యకు ముందు కూడా రామకృష్ణ ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించినట్లు అతని తల్లి చెప్పింది. రామకృష్ణ బలాదూరుగా తిరిగేవాడని.. ఇప్పటికే చాలా అప్పులు చేశాడని...

kothagudem : వనమా రాఘవ కేసులో బిగ్ ట్విస్ట్, రామకృష్ణ బలాదూర్‌‌గా తిరిగేవాడు

Vanama

Vanama Raghava Issue : పాల్వంచలో సంచలనం సృష్టించిన రామకృష్ణ సూసైడ్ కేసు మరో మలుపు తిరుగుతోంది. తన కొడుకు రామకృష్ణ చేసిన ఆరోపణలు అన్నీ తప్పంటోంది అతని తల్లి సూర్యావతి. అసలు ఈ కేసుతో వనమా రాఘవేంద్రకు ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది. వనమా ఫ్యామిలీలో పాతికేళ్లుగా తమకు సత్సంబంధాలు ఉన్నాయంది. ఎవరో కావాలనే రాఘవేంద్రను ఇందులో ఇరికిస్తున్నారని చెప్పుకొచ్చింది.

Read More : Palwancha Issue : వనమా రాఘవేంద్ర అరెస్టు…టీఆర్ఎస్ నుంచి సస్పెండ్

ఆత్మహత్యకు ముందు కూడా రామకృష్ణ ఉరి వేసుకొనేందుకు ప్రయత్నించినట్లు అతని తల్లి చెప్పింది. రామకృష్ణ బలాదూరుగా తిరిగేవాడని.. ఇప్పటికే చాలా అప్పులు చేశాడని అతని తల్లి చెబుతోంది. అయితే తన వద్ద ఉన్న డబ్బులు కూడా రామకృష్ణకు ఇచ్చానని.. అయినా అతని తీరు మారలేదని చెప్పింది. ఆస్తి విషయంపై మాట్లాడడానికే వనమా రాఘవేంద్ర దగ్గరికి తీసుకెళ్లానని చెప్పింది. వనమా రాఘవేంద్ర, తల్లి సూర్యావతి, అక్క మాధవి వల్లే తాము చనిపోతున్నట్లు రామకృష్ణ సెల్ఫీ వీడియోలో చెబితే.. రామకృష్ణ చెప్పినవన్నీ అబద్ధాలని అతని తల్లి చెబుతోంది. అసలు ఈ విషయంలో తనను రామకృష్ణ ఎందుకు ఇరికించాడో తెలియదన్నారు మాధవి. రాఘవేంద్రతో తమకు ఎలాంటి గొడవలు లేవన్నారు.

Read More : 
Gang War : ఎల్బీనగర్‌లో మరో గ్యాంగ్ వార్.. కుటుంబంపై 20మంది యువకుల దాడి

మరోవైపు….కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో.. వనమా రాఘవపై ఆరోపణలున్నాయి. రామకృష్ణ సూసైడ్‌ లెటర్‌, సెల్ఫీ వీడియో ఆధారంగా.. వనమా రాఘవపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దమ్మపేట వద్ద.. రాఘవను అదుపులోకి తీసుకున్నారు. వనమా రాఘవ అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ సునీల్‌ దత్‌ ధ్రువీకరించారు. రామకృష్ణ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవేంద్రపై టీఆర్ఎస్‌ అధిష్టానం సీరియస్‌ యాక్షన్‌ తీసుకుంది. వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.